Site icon NTV Telugu

Mahindra Thar: బెంజ్‌ కార్‌ను రక్షించిన మహీంద్రా థార్.. ఒకసారి ఈ వైరల్ వీడియో చూడండి..

Mahindra Thar

Mahindra Thar

Mahindra Thar: మహీంద్రా థార్ ఇండియాలోనే టాప్ ఆఫ్ రోడర్ SUVగా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. థార్‌కు ఉన్న క్రేజ్ మరే ఇతర ఆటోమొబైల్ కంపెనీల్లో ఆఫ్ రోడర్లకు రాలేదంటే అతిశయోక్తి కాదు. 4X4 ఆల్ వీల్ డ్రైవ్‌తో పాటు రియర్ వీల్ డ్రైవ్ ‌తో థార్ వస్తుంది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో మాత్రం తెగ వైరల్ అవుతోంది. బురదలో చిక్కుకున్న మెర్సిడెస్-బెంజ్ GLE 53 కారును, మహీంద్రా థార్ బయటకు లాగుతున్న దృశ్యాలు కనిపించాయి.

Read Also: Tejashwi Yadav: మోడీ-నితీష్ పాలనలో బీహార్ తాలిబాన్‌లా మారింది..

ఒక గుంతలో చిక్కుకున్న బెంజ్ కారును, థార్ తాడుతో బయటకు లాగుతున్న వీడియో వైరల్ అయింది. ఈ సంఘటన గుజరాత్‌లోని వల్సాడ్ జాతీయ రహదారిపై జరిగిందని తెలుస్తోంది. నిజానికి బెంజ్ కారు వేరే ఒక వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన సందర్భంలో ట్రాక్షన్ కోల్పోయి బుదరలో చిక్కుకుపోయింది. కారు ముందు ఎడమ టైర్ బుదరలో చిక్కుకుంది. బెంజ్ కారును బురద నుంచి తీయడానికి థార్-3 డోర్ ప్రయత్నిస్తున్నట్లు చూపిస్తోంది. కొన్ని ప్రయత్నాల తర్వాత చివరకు థార్ 4X4 తన శక్తిని నిరూపించుకుంది. మెర్సిడెస్ బెంజ్‌ GLE 53ని బురద నుండి బయటకు తీసింది.

ఈ రెండు కార్ల బలాబలాలు పరిశీలిస్తే, మహీంద్రా థార్ -3 డోర్ కారు మూడు ఇంజన్ ఆప్షన్ల కలిగి ఉంది. ఇందులో 150 హెచ్‌పీ పవర్ అందించే 2.0 లీటర్ mStallion టర్బో పెట్రోల్, 116 hp పవర్ జనరేట్ చేసే 1.5L mHawk టర్బో డీజిల్, 130 hpని ఉత్పత్తి చేసే 2.2L mHawk టర్బో డీజిల్ కలిగి ఉంటుంది. మరోవైపు, మెర్సిడెస్ బెంజ్ GLE కూపే 3.0L 6-సిలిండర్ల ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది ఆల్ వీల్ డ్రైవ్(AWD) సిస్టమ్ కలిగి ఉంటుంది. ఏకంగా 429 హెచ్‌పీ, 560 ఎన్ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది. పేపర్‌పై బలాల పరంగా చూస్తు బెంజ్ శక్తివంతంగా కనిపిస్తున్నప్పటికీ, థార్ తన ఆఫ్‌రోడ్ బలాన్ని మరోసారి నిరూపించుకున్నట్లు వీడియోను చూస్తే తెలుస్తోంది.

Exit mobile version