NTV Telugu Site icon

Mahindra Thar 5-door: మహీంద్రా థార్ 5-డోర్ వచ్చేది అప్పుడే..

Thar 5 Door

Thar 5 Door

Mahindra Thar 5-door: మహీంద్రా థార్ ఈ కార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లాంచ్ చేసిన కొద్ది కాలంలోనే ఎన్నో యూనిట్ల థార్ కార్లు అమ్ముడయ్యాయి. 3-డోర్ తో వచ్చిన థార్ చాలా పెద్ద సక్సెస్ అయింది. ఆల్ వీల్ డ్రైవ్ ముందుగా లాంచ్ అయిన థార్.. ఇప్పుడు రేర్ వీల్ డ్రైవ్ తో రాబోతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు థార్ 5-డోర్ తీసుకువస్తున్నట్లు మహీంద్రా ప్రకటించింది. ఇది ఎప్పుడు రాబోతుందా..? అనే ఆశలో చాలా మంది థార్ లవర్స్ ఉన్నారు.

ఇదిలా ఉంటే కంపెనీ 5-డోర్ థార్ పై కీలక విషయాన్ని ప్రకటించింది మహీంద్రా. మహీంద్రా యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఆటో మరియు ఫార్మ్ సెక్టార్) రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ.. 2023లో 5-డోర్ థార్ లాంచ్ కాదని, 2024లో మార్కెట్లోకి తీసుకువస్తామని వెల్లడించారు. అక్టోబర్ 2020లో భారతదేశంలో మహీంద్రా థార్ 3-డోర్ లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఆఫ్-రోడర్ కార్లలో థార్ మొదటిస్థానంలో ఉంది.

Read Also: Hidimbha Trailer: అమ్మాయిలను అతికిరాతకంగా చంపుతున్న ‘హిడింబ’ ఎవరు..?

థార్ కు కాంపిటీషన్ గా మారుతి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా ఆఫ్-రోడర్ కార్లను మార్కెట్ లోకి తీసుకువచ్చింది. జూన్ మొదటివారంలో విడుదల కానున్న మారుతి సుజుకి జిమ్నీ ప్రధాన కాంపిటేటర్ గా ఉంది. జిమ్నిని 5-డోర్ వెర్షన్ లో ఇండియన్ మార్కెట్ లోకి తీసుకువచ్చారు. థార్ లాగే జిమ్ని కూడా 4 వీల్ డ్రైవ్ తో వస్తోంది.

థార్ లో ప్రస్తుతం 3 ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ D117 CRDe డీజిల్ ఇంజిన్ 117 బీహెచ్పీ పవర్ 300ఎన్ఎం టార్క్ ని జనరేట్ చేస్తుంది. 2.2 లీటర్ mHawk 130 CRDe డిజిల్ ఇంజిన్ 130 బీహెచ్పీ, 300 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్ 150 బీహెచ్పీ, 350 టార్క్ కలిగి ఉంటుంది. 1.5 లీటర్ డిజిల్ ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2.2 డిజిల్, 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్లు 6 స్పీడ్ మాన్యువల్, 6స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ ఛాయిస్ లను కలిగి ఉంది. థార్ రూ. 10,54,500 నుండి ప్రారంభమై రూ. 16,77,501 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Show comments