Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra New SUV: భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా & మహీంద్రా సంప్రదాయంగా కొనసాగిస్తోంది. అదే సంప్రదాయాన్ని 2026లోనూ కొనసాగించేందుకు కంపెనీ సిద్ధమైంది. ఈ ఏడాది ఆగస్టు 15న కొత్త మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సంకేతాలు ఇస్తోంది.
ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్, విజన్ S, BE 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీ వంటి మోడళ్లను టెస్టింగ్ చేస్తోంది. వీటిలో స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో విడుదలైన స్కార్పియో Nకు ఇప్పటివరకు స్వల్ప మార్పులు మాత్రమే రావడంతో ఇప్పుడు మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ తీసుకురావడానికి ఇదే సరైన సమయంగా మారింది.
Also Read
- Tesla Kids Bike: పిల్లల కోసం టెస్లా కొత్త బ్యాలెన్స్ బైక్.. పెడల్స్, మోటార్ లేకుండానే సైక్లింగ్ నేర్పించే ప్రత్యేక డిజైన్
- Hero Surge S32: స్కూటర్‌ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
- Ather Battery Update: ఏథర్ స్కూటర్లకు కొత్త బ్యాటరీ అప్డేట్.. ఇప్పుడు ఎక్కువ రేంజ్, వేగవంతమైన ఛార్జింగ్!
- Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
ప్రీమియం లుక్:
కొత్త స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో ఫ్రంట్ డిజైన్‌లో పలు మార్పులు కనిపించనున్నాయి. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన బంపర్, అప్డేటెడ్ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను అందించే అవకాశం ఉంది. వెనుక భాగంలో కూడా స్వల్ప కాస్మెటిక్ మార్పులు ఉండే అవకాశముంది.
మరోవైపు క్యాబిన్లో మరింత ప్రీమియం అనుభూతిని అందించేలా పలు అప్డేట్స్ వచ్చే అవకాశముంది. పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు అందించవచ్చని సమాచారం. అలాగే ప్రస్తుతం టాప్ వేరియంట్లలో మాత్రమే ఉన్న ADAS (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్లను మరిన్ని వేరియంట్లకు విస్తరించే అవకాశం ఉంది.
ఇంజిన్‌లో మార్పులు:
మెకానికల్‌గా మాత్రం ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం ఉన్న 2.2-లీటర్ టర్బో డీజిల్, 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లే కొనసాగనున్నాయి. ఈ ఇంజిన్లకు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. ఎంపిక చేసిన వేరియంట్లలో ఫోర్-వీల్ డ్రైవ్ (4WD) వ్యవస్థ కూడా కొనసాగనుంది. అలాగే మహీంద్రా విజన్ S ఇంకా మార్కెట్‌కు రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. కంపెనీ BE 07 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆగస్టు 15న ఆవిష్కరించే అవకాశం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే కంపెనీ అధికారిక టీజర్లు విడుదల చేసిన తర్వాతే ఏ మోడల్ వస్తుందనే దానిపై స్పష్టత రానుంది. ఆగస్టు 15న మహీంద్రా ఏ సర్ప్రైజ్ ఇవ్వబోతోందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
-
RAAKA: ‘రాకా’లో తెలుగు బ్యూటీ ఎంట్రీ…. అల్లు అర్జున్ సినిమాతో సిరి హనుమంతుకు బిగ్ బ్రేక్!
-
Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్‌గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్‌మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!