NTV Telugu Site icon

Nissan Magnite SUV: ఇండియాలో భారీగా అమ్ముడవుతున్న నిస్సాన్ మాగ్నైట్.. లక్షల్లో యూనిట్లు సేల్

Nissan Magnite

Nissan Magnite

నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీని జపనీస్ ఆటోమేకర్ భారత మార్కెట్లో విక్రయిస్తోంది. కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. సేల్స్ పరంగా నిస్సాన్ సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే.. కంపెనీ ఎలాంటి రికార్డు సృష్టించింది..? గత నెలలో ఎన్ని యూనిట్లు విక్రయించబడ్డాయి? ఎన్ని యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి? ఈ విషయాలు తెలుసుకుందాం.. నిస్సాన్ మాగ్నైట్ SUV ఇండియాలో కాంపాక్ట్ SUV విభాగంలో అందిస్తోంది. నిస్సాన్ కంపెనీ ఈ కారును తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో అందిస్తుంది. ఈ క్రమంలో.. నిస్సాన్ విక్రయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. కంపెనీ సమాచారం ప్రకారం.. భారత్‌లో మొత్తం ఐదు లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.

MG Cyberster EV: 580 కి.మీ రేంజ్.. సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్న స్పోర్ట్స్‌ కార్

నవంబర్ 2024లో పనితీరు:
2024 నవంబర్‌లో నిస్సాన్ 9040 యూనిట్ల కార్లను విక్రయించింది. వీటిలో 2342 యూనిట్లు భారత మార్కెట్లో సేల్ అయ్యాయి. 6698 యూనిట్లు ఎగుమతి చేశారు. నవంబర్ నెలలో 62 శాతం విక్రయాలు పెరిగాయి. 2024 అక్టోబర్‌లో నిస్సాన్ 5570 యూనిట్లు విక్రయించగా, నవంబర్‌లో ఈ సంఖ్య 9040 యూనిట్లకు పెరిగింది.

డిమాండ్ పెరిగింది:
మేడ్ ఇన్ ఇండియా నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీకి దేశీయ మార్కెట్‌తో పాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీ నుండి అందిన సమాచారం ప్రకారం.. నెలవారీ ప్రాతిపదికన ఎగుమతుల్లో 173.5 శాతం పెరుగుదల, సంవత్సర ప్రాతిపదికన 222 శాతం పెరుగుదల ఉంది. 2023 నవంబర్‌లో కంపెనీ 2081 యూనిట్లను ఎగుమతి చేసింది. 2024 అక్టోబర్‌లో ఈ సంఖ్య 2449 యూనిట్లుగా ఉంది. 2024 నవంబర్‌లో కంపెనీ 6698 యూనిట్లను ఎగుమతి చేసింది.

త్వరలో కొత్త ఎస్‌యూవీ:
నిస్సాన్ ఇటీవలే మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది కాంపాక్ట్ SUV విభాగంలో అందించనున్నారు. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. అయితే.. నిస్సాన్ రాబోయే కొద్ది నెలల్లో కొత్త SUVని విడుదల చేయనున్నట్లు సమాచారం. 2025 జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పో సందర్భంగా నిస్సాన్ తన కొత్త SUVని విడుదల చేస్తుందని భావిస్తున్నారు.

Show comments