ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!

Kia Syros Ev

Kia Syros Ev

Kia Syros EV Launch: కియా ఇండియా భారత మార్కెట్లో తన రెండో మేడ్-ఇన్-ఇండియా మాస్ మార్కెట్ ఎలక్ట్రిక్ SUV కియా సైరోస్ ఈవీ (Kia Syros EV)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ, 526 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్, Level-2 ADAS, ప్రీమియం ఫీచర్లు, Battery-as-a-Service (BaaS) వంటి ప్రత్యేక సదుపాయాలతో ఈ ఎలక్ట్రిక్ SUVను కంపెనీ తీసుకొచ్చింది.

రెండు బ్యాటరీ ఆప్షన్లు..

కియా సైరోస్ ఈవీను 42kWh, 51.4kWh Extended Range అనే రెండు బ్యాటరీ వేరియంట్లలో అందిస్తున్నారు. 42kWh బ్యాటరీతో 443 కిలోమీటర్ల (MIDC Full) వరకు రేంజ్ లభిస్తే, 51.4kWh Extended Range బ్యాటరీతో 526 కిలోమీటర్ల (MIDC Full) వరకు ప్రయాణించవచ్చు. 51.4kWh వేరియంట్ 171 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ SUV కేవలం 8.1 సెకన్లలో 0-100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. ఇందులో Nickel Manganese Cobalt (NMC) బ్యాటరీ, IP67 వాటర్ & డస్ట్ రెసిస్టెంట్ రేటింగ్, లిక్విడ్ కూలింగ్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను కంపెనీ అందించింది.

Kia Syros EV 100kW DC ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు ఇస్తుంది. దీని ద్వారా బ్యాటరీని 10% నుంచి 80% వరకు కేవలం 39 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. అలాగే 10.8kW AC ఆన్‌బోర్డ్ ఛార్జర్, బ్యాటరీ కండిషనింగ్ టెక్నాలజీ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ఈ SUVలో..

* రీజనరేటివ్ బ్రేకింగ్ విత్ ప్యాడిల్ షిఫ్టర్స్
* i-Pedal మోడ్
* Vehicle-to-Load (V2L)
* Virtual Engine Sound System (VESS)
* బ్యాటరీ హీటింగ్ సిస్టమ్
* Shift-by-Wire టెక్నాలజీ వంటి EV ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

ప్రీమియం డిజైన్‌:

Kia Syros EVలో కంపెనీ ప్రత్యేకమైన డిజిటల్ టైగర్ ఫేస్ (Digital Tiger Face) డిజైన్‌ను అందించింది. అలాగే LED హెడ్‌ల్యాంప్స్, Star Map LED DRLs, LED టెయిల్ ల్యాంప్స్, 17 అంగుళాల డ్యూయల్-టోన్ ఏరో అల్లాయ్ వీల్స్, ఆటో స్ట్రీమ్‌లైన్ డోర్ హ్యాండిల్స్, గ్లోస్ బ్లాక్ రూఫ్ రైల్స్, స్కిడ్ ప్లేట్లు వంటి అంశాలు SUVకి మరింత స్టైలిష్ లుక్‌ను ఇస్తాయి.

ఈ ఎలక్ట్రిక్ SUVలో 30 అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్ప్లే ప్యానెల్ (Trinity Panoramic Display Panel) ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇందులో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 5 అంగుళాల క్లైమేట్ కంట్రోల్ డిస్‌ప్లే ఉన్నాయి. వీటితోపాటు..

* Kia Connect 2.0 (95కిపైగా కనెక్టెడ్ ఫీచర్లు)
* OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్
* వైర్‌లెస్ Android Auto, Apple CarPlay
* Harman Kardon 8-స్పీకర్ ప్రీమియం సౌండ్ సిస్టమ్
* వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్
* డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్
* 64 కలర్ అంబియంట్ లైటింగ్
* స్మార్ట్ డ్యాష్‌క్యామ్
* 100W USB Type-C ఛార్జింగ్
* 16 లీటర్ల ఫ్రంట్ ట్రంక్ (Frunk) వంటి ఫీచర్లు ఉన్నాయి.

ప్రయాణికుల సౌకర్యం కోసం ముందు వెంటిలేటెడ్ సీట్లు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, 4-వే పవర్ డ్రైవర్ సీట్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు. స్లైడ్ & రీక్లైన్ ఫంక్షన్, రియర్ డోర్ సన్‌షేడ్స్ వంటి సదుపాయాలు అందించారు. Kia Syros EVలో Level-2 ADASతో మొత్తం 16 ఆటోనమస్ డ్రైవింగ్ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో..

* ఫ్రంట్ కొలిజన్ అవాయిడెన్స్ అసిస్ట్ (Front Collision Avoidance Assist),
* స్టాప్ & గోతో కూడిన స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ (Smart Cruise Control with Stop & Go),
* లేన్ కీపింగ్ అసిస్ట్ (Lane Keeping Assist),
* లేన్ ఫాలోయింగ్ అసిస్ట్ (Lane Following Assist),
* 360 డిగ్రీ కెమెరా,
* బ్లైండ్ వ్యూ మానిటర్ (Blind View Monitor),
* పార్కింగ్ ఢీకొనకుండా నివారించే సహాయక వ్యవస్థ (Parking Collision Avoidance Assist),
* ఫ్రంట్, రియర్, సైడ్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
* 6 ఎయిర్‌బ్యాగ్స్
* Electronic Stability Control (ESC),
* Hill Start Assist,
* Brake Assist,
* Tyre Pressure Monitoring System (TPMS),
* ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్,
* Electric Parking Brake with Auto Hold వంటి మొత్తం 25 హై-సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

Battery-as-a-Service (BaaS) ప్రత్యేకత:

ఈ SUVతో Kia Battery-as-a-Service (BaaS) పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్‌లో వాహనం, బ్యాటరీకి వేర్వేరు ఫైనాన్సింగ్ ఉంటుంది. దీంతో రూ. 7.99 లక్షల నుంచి వాహనం సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యాటరీ కోసం ప్రతి కిలోమీటర్‌కు రూ. 3.3 చెల్లించాల్సి ఉంటుంది. దీనిని మొదటి యజమానికి 15 సంవత్సరాల అపరిమిత కి.మీ. బ్యాటరీ వారంటీ అందిస్తుండగా.. రెండో యజమానికి 8 సంవత్సరాలు లేదా 1.6 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ లభిస్తుంది. అలాగే 3 సంవత్సరాల తర్వాత 80% వరకు Assured Buyback సదుపాయం కూడా కంపెనీ అందిస్తోంది.

ధరలు (ఎక్స్-షోరూమ్):

42kWh బ్యాటరీ వేరియంట్:
* HTK – రూ. 13,49,900
* HTK+ – రూ. 14,99,900
* HTX – రూ. 15,99,900

51.4kWh Extended Range వేరియంట్:
* HTK+ ER – రూ. 16,99,900
* HTX ER – రూ. 17,99,900
* HTX+ ER – రూ. 19,49,900
* X-Line ER – రూ. 19,99,900
Kia Syros EV భారతదేశంలోని అన్ని Kia డీలర్‌షిప్‌లలో జూలై 30 అమ్మకాలకు అందుబాటులోకి రానుంది.