Kia Seltos 2026: కియా ఇండియా (Kia India) తన కొత్త జెనరేషన్ సెల్టాస్ SUVను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. కొత్త డిజైన్, కొత్త టెక్నాలజీతో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ.10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, టాప్ వేరియంట్ ధర రూ.19.99 లక్షలు వరకు ఉంది. డిజైన్ పరంగా 2026 కియా సెల్టాస్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ముందు భాగంలో కొత్త టైగర్ నోస్ గ్రిల్, ఆధునిక LED లైటింగ్ ఎలిమెంట్స్, ఆకర్షణీయమైన కొత్త బంపర్లు ఇచ్చారు. వెనుక భాగంలో కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ తో పాటు కొత్త టెయిల్ గేట్ డిజైన్ అందించారు. మొత్తం మీద ఈ డిజైన్ అప్డేట్స్తో కొత్త సెల్టాస్ మరింత ప్రీమియం మరియు స్పోర్టీ లుక్ ను సొంతం చేసుకుంది.
రూ. 10.99 లక్షల ప్రారంభ ధరతో Kia Seltos 2026 భారత్‌లో లాంచ్.. ఏ మోడల్ ఎంత ధరంటే..?
K3 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన ఈ SUV, ఇప్పుడు 4,460 mm పొడవు, 1,830 mm వెడల్పు, 1,635 mm ఎత్తుతో తన సెగ్మెంట్లో పెద్దదిగా నిలుస్తోంది. వీల్‌బేస్‌ను 80 mm పెంచి 2,690 mmకు తీసుకువచ్చారు. కొత్త 18 అంగుళాల అలాయ్ వీల్స్, గన్మెటల్ ఫినిష్ స్కిడ్ ప్లేట్స్, అప్రైట్ ప్రొఫైల్ ఈ కార్కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో.. కొత్త డ్యాష్‌బోర్డ్ డిజైన్, డ్యుల్-టోన్ హైలైట్స్, లెదరెట్ అప్హోల్స్టరీతో క్యాబిన్ మరింత ఆధునికంగా మారింది. 30 అంగుళాల కర్వ్డ్ డ్యువల్ స్క్రీన్ సెటప్, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, ఫిజికల్, రోటరీ కంట్రోల్స్ వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.
ఫీచర్ల పరంగా కొత్త సెల్టాస్లో డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, సీట్స్ వెంటిలేషన్, వైర్లెస్ ఛార్జర్, ఆండ్రాయిడ్ ఆటో అండ్ ఆపిల్ కార్ ప్లే, హెడ్స్-అప్ డిస్ప్లే (HUD), పవర్డ్ డ్రైవర్ సీట్స్, ORVM మెమోరీ ఫంక్షన్, 8-స్పీకర్ Bose ఆడియో సిస్టమ్, అంబియంట్ లైటింగ్, రియర్ రీక్లైనింగ్ సీట్స్, స్మార్ట్ ప్రోక్సిమిటీ కీ వంటి అనేక ఆధునిక సౌకర్యాలు ఉన్నాయి.
Jason Gillespie: అందుకే పాక్ జట్టు కోచ్‌గా తప్పుకున్న: జేసన్ గిలెస్పీ
సేఫ్టీ విషయంలో కియా ఎలాంటి రాజీ పడలేదు. ఈ SUVలో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-స్టార్ట్ అసిస్టు, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్స్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, OTA అప్డేట్స్ తో పాటు లెవల్-2 ADAS ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో లేన్-కీపింగ్ అసిస్టు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. అలాగే ఇందులో స్నో, మడ్, సాండ్ వంటి ట్రాక్షన్ మోడ్లు కూడా ఉన్నాయి.
పవర్ట్రైన్ విషయానికి వస్తే 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 hp, 144 Nm), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 hp, 253 Nm), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (116 hp, 250 Nm) ఆప్షన్లు లభిస్తాయి. వీటికి MT, iVT, DCT, AT ట్రాన్స్మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. మొత్తంగా భారత మార్కెట్లో కొత్త కియా సెల్టాస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, హోండా ఎలివేట్, టాటా సియెర్రా వంటి ప్రముఖ SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.