Site icon NTV Telugu

JSW Motors తొలి SUV ఎంట్రీ.. హైబ్రిడ్ టెక్నాలజీతో భారత మార్కెట్‌లోకి Jetour T2 i-DM..!

Jsw Motors Jetour T2 I Dm

Jsw Motors Jetour T2 I Dm

JSW Motors Jetour T2 i-DM: దేశ ప్యాసింజర్ వాహన మార్కెట్‌ లోకి JSW మోటార్స్ సిద్ధమవుతోంది. కంపెనీ నుండి తొలి SUV‌ను ఈ ఏడాది దివాళి పండుగకు ముందే లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ కొత్త SUV, అంతర్జాతీయంగా పేరు పొందిన Jetour T2 ప్లాట్‌ఫామ్‌పై తయారవుతుండగా.. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా హైబ్రిడ్ పవర్‌ట్రైన్‌తో అందించనున్నారు. మరి ఈ రాబోయే పూర్తి వివరాలను చూసేద్దామా..

పవర్, స్టైల్, పెర్ఫార్మెన్స్తో జనవరి 29న చైనాలో REDMI Turbo 5 సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇలా..!

ఈ లాంచ్‌తో JSW మోటార్స్ ఒక కారు తయారీదారుగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తోంది. భారతీయ రోడ్డు పరిస్థితులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ SUV‌ను డిజైన్ చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం ఎలక్ట్రిక్ అసిస్టెన్స్, హైవే ప్రయాణాల్లో పెట్రోల్ ఇంజిన్ సహకారంతో ఈ వాహనం ప్రాక్టికాలిటీతో పాటు ఇన్నోవేషన్‌ను అందించనుంది.

ప్రపంచ మార్కెట్‌లో Jetour T2 సాధారణ పెట్రోల్ ఇంజిన్ వెర్షన్లలో లభిస్తున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం JSW Motors ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ అయిన Jetour T2 i-DMను లాంచ్ కానుంది. ఇది 1.5 లీటర్ హైబ్రిడ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. అంతర్జాతీయంగా ఈ మోడల్ ఆల్-వీల్ డ్రైవ్, ఫ్రంట్-వీల్ డ్రైవ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే భారత్‌కు ఏ వెర్షన్ వస్తుందన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. జెటూర్ బ్రాండ్ ప్రధానంగా SUVలు, క్రాస్‌ఓవర్‌ లపై దృష్టి సారించిన ఈ బ్రాండ్ రగ్గడ్ డిజైన్, ప్రీమియం ఫీల్‌తో గుర్తింపు పొందింది. Jetour T2 డిజైన్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుండగా, బాక్సీ లుక్‌తో బలమైన రోడ్ ప్రెజెన్స్‌ను కలిగి ఉంది.

Governor Jishnu Dev Varma: పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం దిశగా అడుగులు..!

ప్లగ్-ఇన్ హైబ్రిడ్ సిస్టమ్ ద్వారా ఈ వాహనం 156 PS పవర్, 220 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పనితీరు, ఇంధన సామర్థ్యం రెండింటికీ సమతుల్యతను అందించేలా ఈ సెటప్ రూపొందించబడింది. ఆధునిక డిజైన్, హైబ్రిడ్ టెక్నాలజీ, విశాలమైన ఇంటీరియర్స్‌తో Jetour T2 i-DM, JSW Motors‌కు భారత మార్కెట్‌లో మంచి ఆరంభాన్ని అందించడంతో పాటు, వేగంగా ఎదుగుతున్న హైబ్రిడ్ SUV సెగ్మెంట్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వనుంది.

Exit mobile version