NTV Telugu Site icon

Jeep Compass: జీప్ కంపాస్ స్పెషల్ ఎడిషన్ రిలీజ్.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Jeep

Jeep

ఇండియాలో జీప్ కంపాస్ SUV యొక్క ప్రత్యేక వార్షికోత్సవ ఎడిషన్‌ను విడుదల చేసింది. యానివర్సరీ ఎడిషన్‌ను, సరికొత్త అప్ డేట్స్‌తో (అక్టోబర్ 3) గురువారం రోజు లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ లో కాస్మెటిక్, యాక్సెసరీ అప్డేట్స్ ఉన్నాయి. లిమిటెడ్ ఎడిషన్ జీప్ కంపాస్ బ్రాండ్ కు భారత్ లో ఎనిమిదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా యానివర్సరీ ఎడిషన్ ను ప్రకటించారు.

CM Chandrababu: మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం చంద్రబాబు

జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్:
SUV వెలుపలి భాగం గురించి చెప్పాలంటే.. కంపాస్‌లో స్టైలిష్ వెల్వెట్ రెడ్ గ్రిల్ ఇన్సర్ట్, బ్లాక్.. రెడ్ కల్సర్‌తో చేసిన డ్యూయల్-టోన్ హుడ్ డెక్.. బ్లాక్-అవుట్ ORVMలు ఉన్నాయి. SUV 17-అంగుళాల అల్లాయ్ వీల్స్, LED హెడ్‌లైట్లు, టెయిల్ ల్యాంప్‌లను కలిగి ఉంది.

ఇంటీరియర్ మరియు ఫీచర్లు:
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. స్పెషల్ ఎడిషన్‌లో రెడ్ లెథెరెట్ సీట్ కవర్లు, వైట్ యాంబియంట్ లైటింగ్ మరియు డాష్‌క్యామ్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా.. కొత్త ఎడిషన్‌లో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, డ్యూయల్ ప్యాన్ పనోరమిక్ సన్ రూఫ్, జీప్ లైఫ్ కనెక్టివిటీ సూట్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి. దీనితో స్మార్ట్‌ఫోన్‌ను సులభంగా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు.

ఇంజిన్ పవర్, గేర్‌బాక్స్:
జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ 2.0-లీటర్ డీజిల్ ఇంజన్‌తో అందిస్తున్నారు. ఈ ఇంజన్ 168 హెచ్‌పి పవర్ , 350 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వినియోగదారులు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఎంచుకోవచ్చు. అలాగే.. రెండు ఫ్రంట్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో వస్తాయి. జీప్ కంపాస్ యానివర్సరీ ఎడిషన్ SUV ధర రూ. 25.26 లక్షల ఎక్స్-షోరూమ్. వార్షికోత్సవ ఎడిషన్ లాంగిట్యూడ్ (O), లిమిటెడ్ (O) ట్రిమ్‌లతో వస్తుంది. ఈ మోడల్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్ నెట్‌వర్క్‌లో బుక్ చేసుకోవచ్చు.

Show comments