NTV Telugu Site icon

Ambassador: త్వరలో హైటెక్ ఫీచర్స్‌‌తో అంబాసిడర్‌ రీ-ఎంట్రీ.. లూక్ చూస్తే మతి పోవాల్సిందే?

Ambassador

Ambassador

హిందుస్థాన్‌ మోటార్స్‌ కంపెనీ తయారు చేసిన అంబాసిడర్‌ కార్ల ఉత్పత్తి 1957లో ప్రారంభమైంది. 990వ ద‌శ‌కం మ‌ధ్య వ‌ర‌కు దేశంలో అంబాసిడ‌ర్‌ కు ఉన్న క్రేజ్ వేరు. ఈ కారు అప్పట్లో భార‌తీయుల‌కు ఒక స్టేట‌స్ సింబ‌ల్‌. భారత్‌లో ఏకైక సామూహిక ల‌గ్జరీ కారు ఇది. 1991లో స‌ర‌ళీక‌ర‌ణ త‌ర్వాత క్రమంగా అంబాసిడ‌ర్ కారు క‌నుమ‌రుగైంది. కానీ 1980ల ప్రారంభంలో ఖ‌ర్చెక్కువ‌, మైలేజ్‌ తక్కువ కావడంతోపాటు నాసికరం అంబాసిడర్ కార్లను మార్కెట్‌లోకి విడుదల చేయడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. అదే సమయంలో మారుతీ 800 వంటి వేరియంట్లు దేశ‌ మార్కెట్లోకి వ‌చ్చాయి. ధర తక్కువ కావడం, మైలేజ్‌, ట్రెండ్‌కు తగ్గట్లు మోడళ్లు మార్కెట్‌లోకి రావడంతో అంబాసిడర్‌కు డిమాండ్ పూర్తిగా తగ్గిపోయింది. ఏటా 20 వేలకు పైగా వాహ‌నాలు అమ్ముడ‌య్యే అంబాసిడ‌ర్.. 1980వ ద‌శ‌కం మ‌ధ్యలోకి వ‌చ్చేస‌రికి రెండువేల‌కు ప‌రిమిత‌మయ్యాయి. క్రమంగా అమ్మకాలు ప‌డిపోవ‌డంతో 2013-14లో పూర్తిగా ఉత్పత్తి నిలిపేశారు.

READ MORE: Apple iPhone Fold: యాపిల్ లవర్స్ గెట్ రెడీ.. ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

అంబాసిడర్ కారు దాదాపు 57 సంవత్సరాలుగా మార్కెట్లో అమ్మకాలు కొనసాగించింది. తాజాగా ఓ గుడ్‌న్యూస్ వినిపిస్తోంది. అంబాసిడర్ త్వరలో తిరిగి అమ్మకానికి వస్తుందని ప్రస్తుత నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం అంబాసిడర్ బ్రాండ్ పేరును వాడుకునే హక్కులన్ని కూడా PSA గ్రూప్‌ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఫ్రెంచ్ కార్ల కంపెనీ అయిన దీని కింద చాలా కంపెనీలు ఉన్నాయి. సిట్రోయెన్ వంటి కంపెనీలన్నీ కూడా PSA గ్రూప్ కిందకు వస్తాయి. ఇటీవల అంబాసిడర్‌ను తిరిగి విక్రయానికి తీసుకురావాలని ఈ గ్రూప్ ఆలోచన చేస్తుంది. తాజా నివేదికల ప్రకారం.. కొత్త అంబాసిడర్ కారును వచ్చే ఏడాది అంటే 2026 మార్చి నెలలో భారతీయ మార్కెట్లో తిరిగి అమ్మకానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అలాగే సమాచారం ప్రకారం, ఈ ప్రసిద్ధ కస్టమర్లు కొనగలిగే విధంగా రూ.10 లక్షల ప్రారంభ ధరతో లభించవచ్చని తెలుస్తుంది.