NTV Telugu Site icon

Hyundai Verna: కొత్త కలర్స్‌లో రిలీజైన్ హ్యుందాయ్ వెర్నా..

Hyundai Verna

Hyundai Verna

హ్యుందాయ్ వెర్నా రెండు కొత్త ఫీచర్లతో ముందుకొస్తుంది. ఈ కారు వెనుక స్పాయిలర్‌తో వస్తుంది. అంతేకాకుండా.. కొత్త గ్రే మోనోటోన్ కలర్ ఆప్షన్ లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. అలాగే.. హ్యుందాయ్ వెర్నా భారతీయ కస్టమర్ల కోసం మొత్తం 8 మోనోటోన్ షేడ్స్‌లో అందుబాటులో ఉంటుంది. కొత్త రంగు ఎంపికలలో టైటాన్ గ్రే, అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైఫూన్ సిల్వర్, స్టార్రి నైట్, ఫైరీ రెడ్, టెల్లూరియన్ బ్రౌన్, అట్లాస్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, ఫైరీ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ ఉన్నాయి. ధర విషయానికొస్తే.. హ్యుందాయ్ వెర్నా బేస్ వేరియంట్ మినహా అన్ని ట్రిమ్‌ల ధరలు రూ. 5,000 వరకు పెరిగాయి. భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర టాప్ మోడల్‌లో రూ. 11 లక్షల నుండి రూ. 17.47 లక్షల వరకు ఉంది.

కారు పవర్ ట్రైన్:
కారు పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే.. హ్యుందాయ్ వెర్నాలో 3 ఇంజిన్‌ల ఎంపిక ఉంది. మొదటిది 1.5-లీటర్.. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 144Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే.. 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది గరిష్టంగా 160bhp శక్తిని, 253Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. ఇది గరిష్టంగా 115bhp శక్తిని, 250Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

5-స్టార్ సేఫ్టీ:
హ్యుందాయ్ వెర్నాలో వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 8-స్పీకర్ బోట్ ఆడియో సిస్టమ్‌తో కూడిన 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. భద్రత కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌తో సహా 33 కంటే ఎక్కువ ప్రామాణిక ఫీచర్‌లతో అందించారు. కుటుంబ భద్రత కోసం క్రాష్ టెస్ట్‌లో హ్యుందాయ్ వెర్నాకు గ్లోబల్ ఎన్‌సిఎపి 5-స్టార్ రేటింగ్ ఇచ్చింది. హ్యుందాయ్ వెర్నా.. వోక్స్‌వ్యాగన్ వర్టస్, స్కోడా స్లావియా, హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్ వంటి కార్లతో పోటీపడుతుంది.