బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyundai Mercury Electric Ioniq M SUV: Hyundai 2026 గ్వాంగ్జౌ ఇంటర్నేషనల్ ఆటో షోలో “మెర్క్యూరీ కాన్సెప్ట్” పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ SUVని ఆవిష్కరించింది. చైనా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ కాన్సెప్ట్ ప్రొడక్షన్ వెర్షన్‌కు Ioniq M అని పేరు పెట్టనుంది. 2027 మొదటి అర్ధభాగంలో ఈ SUV అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా CATL భాగస్వామ్యంతో బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీని కూడా అభివృద్ధి చేస్తోంది.
చైనా మార్కెట్ కోసం హ్యుందాయ్ రూపొందిస్తున్న Ioniq మోడళ్లలో Mercury రెండో ముఖ్యమైన మోడల్. ఇప్పటికే Ioniq V సెడాన్ సెప్టెంబర్‌లో అమ్మకాలకు వచ్చింది. Venus, Earth కాన్సెప్ట్స్‌తో ప్రారంభమైన గ్రహాల పేర్ల సంప్రదాయాన్ని Mercury కూడా కొనసాగిస్తోంది. మెర్క్యూరీ కాన్సెప్ట్ లో హ్యుందాయ్ తన చైనా-ప్రత్యేక డిజైన్ లాంగ్వేజ్ ‘The Origin’ను ఉపయోగించింది. ముందు భాగంలో బానెట్, సన్నని యాంగ్యులర్ డేటైమ్ రన్నింగ్ లైట్లు, పెద్ద డార్క్ బంపర్ సెక్షన్ ఉన్నాయి. లైటింగ్ యూనిట్లను ముందు భాగం అంచుల్లో అమర్చారు.
Also Read
- 999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
- కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
- Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
- Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
కొత్త Citrine Neon కలర్లో కనిపిస్తున్న ఈ SUVలో భారీ వీల్ ఆర్చ్‌లు, పెద్ద జ్యామెట్రిక్ వీల్స్, డార్క్ లోయర్ క్లాడింగ్ ఉన్నాయి. వాలుగా ఉండే విండ్‌షీల్డ్ స్పోర్టీ లుక్‌ను అందిస్తోంది. కాంట్రాస్ట్ రూఫ్, పిల్లర్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ దీని డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. వెనుక భాగంలో టెయిల్‌గేట్‌పై అడ్డంగా ఉన్న సన్నని లైటింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. మధ్యలో Ioniq లోగోను పొందుపరిచారు. రూఫ్ స్పాయిలర్, ప్రత్యేక స్టైల్ లో ఉన్న టెయిల్‌గేట్, పెద్ద లోయర్ బంపర్ వెనుక డిజైన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బంపర్ మధ్యలో నిలువుగా ఉండే రెడ్ లైటింగ్ ఎలిమెంట్‌ను కూడా అందించారు.
Mercury ఒక పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ SUV అని హ్యుందాయ్ వెల్లడించింది. అయితే బ్యాటరీ సామర్థ్యం, మోటార్ పవర్, డ్రైవింగ్ రేంజ్, ఛార్జింగ్ వివరాలను ఇంకా ప్రకటించలేదు. ఈ SUVలో CATL భాగస్వామ్యంతో బ్యాటరీ స్వాపింగ్ వెర్షన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఈ టెక్నాలజీ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లో డిశ్చార్జ్ అయిన బ్యాటరీని తొలగించి, ఛార్జ్ చేసిన బ్యాటరీని అమర్చుకోవచ్చు. అయితే బ్యాటరీ ఫార్మాట్, స్వాపింగ్ నెట్వర్క్, ధరలుపై కంపెనీ ఇంకా వివరాలు వెల్లడించలేదు.
వాహనంలోని ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోసం చైనా టెక్నాలజీ సంస్థలతోనూ హ్యుందాయ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ZYT నుంచి డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీని, ByteDance అభివృద్ధి చేసిన సంభాషణ ఆధారిత AI మోడల్‌తో స్మార్ట్ కాక్‌పిట్‌ను అందించనుంది. వీటి పూర్తి ఫీచర్లు, పనితీరు వివరాలు తెలియాల్సి ఉంది. చైనా మార్కెట్లో తన ఉత్పత్తుల విస్తరణలో భాగంగా హ్యుందాయ్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2027లో Ioniq Mతో పాటు Ioniq Vకు ఎక్స్టెండెడ్ రేంజ్ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానుంది. అయితే ఈ కొత్త వెర్షన్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలను వెల్లడించలేదు.
Meet MERCURY Concept.
A low shark-nose silhouette, sculpted fenders, and bold SUV proportions define its presence.
Citrine Neon captures the dreamlike shifts of sunlight across Mercury.
#Hyundai #IONIQ #MERCURYConcept https://t.co/QoWM2vruJo
— Hyundai Worldwide (@Hyundai_Global) November 27, 2026
తాజావార్తలు
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం అందరూ ముందుకు రావాలి.. హీరో నాగార్జున పిలుపు
-
Anakapalli Road Accident: అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం.. విద్యార్థినిపై పడిన ఇనుప రేకుల కట్ట!
-
TDP Internal Rift: టీడీపీలో అంతర్గత విభేదాలు.. మంత్రి లోకేష్‌కు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు!
-
Sarpanch Elections 2026: కొడుకు ఎమ్మెల్యే.. సర్పంచ్ బరిలో తండ్రి.. ఏలూరు జిల్లాలో ఆసక్తికర పోటీ!
ట్రెండింగ్
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!
-
Yashasvi Jaiswal History: యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు!
-
Viral Video: ఏంటి స్వామి ఈ పని..? రైలులో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా..
-
25 రోజుల బ్యాటరీ బ్యాకప్, 100+ స్పోర్ట్స్ మోడ్స్ తో Vivo WATCH GT 2 స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Sineth Jayawardena: కోచ్ మాటలతో టీమిండియాపై చెలరేగిపోయా.. శ్రీలంక సెంచరీ హీరో సంచలన వ్యాఖ్యలు!