Site icon NTV Telugu

కొత్త ఇంజిన్, అప్‌డేట్ ఫీచర్లతో రాబోతున్న Hyundai Alcazar Petrol Variant.. ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయంటే..?

Hyundai Alcazar Petrol Variant

Hyundai Alcazar Petrol Variant

Hyundai Alcazar Petrol Variant: హ్యుందాయ్ ఇండియా నుంచి కొత్త పెట్రోల్ వెర్షన్ Hyundai Alcazar ను మార్కెట్‌లోకి తీసుకురాబోతుంది. ఇప్పటికే 6 సీటర్, 7-సీటర్ ఫ్యామిలీ SUVగా మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్న ఆల్కజార్, పెట్రోల్ ఇంజిన్ కోసం పెరుగుతున్న కస్టమర్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త వెర్షన్‌ను ప్లాన్ చేసింది. క్రెటా కంటే కొంచెం పెద్ద SUV కావాలి కానీ డీజిల్ ఎంపిక వద్దు అనుకునే కొనుగోలుదారులను లక్ష్యంగా పెట్టుకొని ఈ పెట్రోల్ మోడల్‌ను తీసుకురానున్నారు.

65 అంగుళాల ప్రీమియమ్ 4K గూగుల్ టీవీ Sony BRAVIA 2M2 Series 4K Ultra HD Smart LEDపై భారీ తగ్గింపు..!

రాబోయే 2025 Alcazar Petrol వేరియంట్‌లో 1.5 లీటర్ టర్బో GDi పెట్రోల్ ఇంజిన్ అందించబడుతుంది. ఇదే ఇంజిన్ ప్రస్తుతం క్రెటాలో కూడా లభ్యమవుతోంది. ఇది అసలైన మంచి పనితీరు, స్మూత్ డ్రైవింగ్, బెటర్ రిఫైన్‌మెంట్ కోసం ప్రసిద్ధి చెందింది. కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్స్‌కి కూడా కంఫర్ట్ అందించేలా ఈ ఇంజన్ ను ఆల్కజార్ కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు.

2025 ఫేస్‌లిఫ్ట్ Alcazarలో ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ రెండింటిలోనూ పెద్ద మార్పులు చూడవచ్చు. ఇందులో మొదటగా ఇంటీరియర్స్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ADAS సేఫ్టీ సూట్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, ఆటో-హోల్డ్ ఫంక్షన్ లో మార్పులు ఉండనున్నాయి. ఇక ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త LED DRLs, స్పోర్టీ బంపర్ డిజైన్, అప్‌గ్రేడ్ గ్రిల్, రీడిజైన్ చేసిన అలాయ్ వీల్స్, మరింత ప్రీమియమ్ SUV లుక్ లతో 2025 డిజైన్ ట్రెండ్స్‌కు అనుగుణంగా ఆల్కజార్ మరింత షార్ప్, బోల్డ్ అపియరెన్స్ పొందనుంది.

65 అంగుళాల ప్రీమియమ్ 4K గూగుల్ టీవీ Sony BRAVIA 2M2 Series 4K Ultra HD Smart LEDపై భారీ తగ్గింపు..!

కొత్త పెట్రోల్ Alcazarను వచ్చే ఏడాది మే–జులై మధ్యలో విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త పెట్రోల్ వేరియంట్ ధర ప్రస్తుతం ఉన్న డీజిల్ మోడల్ కంటే తగ్గి ఉండే అవకాశం ఉంది. దీని ధర అంచనా ప్రకారం 17 లక్షలు నుండి 21 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. డీజిల్ తో పోలిస్తే ఈ ధర తక్కువగా ఉండటం వల్ల, ఆల్కజార్‌కి మార్కెట్‌లో మరింత డిమాండ్ పెరగనుంది.

Exit mobile version