NTV Telugu Site icon

EV Battery Life: ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ లైఫ్ ఎంత..? తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..!

Electric Cars

Electric Cars

దేశంలో ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్ విభాగం గ్రాఫ్ వేగంగా పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలపై జనాలకు నమ్మకం పెరుగుతోంది. ఈ క్రమంలో.. ఎలక్ట్రిక్ వాహనాలను అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. పెట్రోల్ కార్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ కార్లు ప్రతి నెలా భారీ పొదుపును అందిస్తున్నాయి. దీంతో.. జనాలు ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ లైఫ్ గురించి ప్రజలకు కొన్ని సందేహాలు ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం.. ఎలక్ట్రిక్ కారు ధరలో బ్యాటరీ ధర దాదాపు 60% వరకు ఉంటుంది. ఈ క్రమంలో.. మీరు ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకుంటే బ్యాటరీ లైఫ్ గురించి వివరంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Read Also: iPhone: పేరెంట్స్ “ఐఫోన్” కొనివ్వలేదని ఆత్మాహత్యాయత్నం చేసిన అమ్మాయి..

ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ లైఫ్:
ఎలక్ట్రిక్ కారు బ్యాటరీ సాధారణంగా 8 నుండి 10 సంవత్సరాలు సేవలందిస్తుంది. ఈ సమయంలో బ్యాటరీ పూర్తి స్థాయిలో దెబ్బతినదు.. కానీ పరిధి తగ్గిపోతుంది. బ్యాటరీ కొన్ని సంవత్సరాల తరువాత.. ప్రారంభంలో అందించిన పూర్తి రేంజ్‌లో ఉండదు. అందుకే పరిమితి తగ్గుతుంది.

వారంటీ & భవిష్యత్ అంచనాలు:
ఎలక్ట్రిక్ కారు తయారీ సంస్థలు తమ కస్టమర్లకు 7 నుండి 8 సంవత్సరాల మధ్య వారంటీని అందిస్తాయి. లేదంటే.. లక్ష కిలోమీటర్ల నుండి 1.50 లక్షల కిలోమీటర్ల మధ్య వారంటీ ఇస్తారు. కొన్ని సంస్థలు ఈ వారంటీని ఇంకా ఎక్కువ లేదా తక్కువ కాలం ఇవ్వవచ్చు.. అయితే ఇది కంపెనీపై ఆధారపడి ఉంటుంది.

ఇ-కార్లకు ఆధునిక బ్యాటరీల వాడకం:
ఎలక్ట్రిక్ కార్లు సాధారణంగా అత్యాధునిక, దీర్ఘకాలిక బ్యాటరీలతో అమర్చబడి ఉంటాయి. ఈ బ్యాటరీలు సాధారణంగా మరింత సదుపాయాన్ని అందిస్తాయి.. కావున కారు యజమానులు తమ కారు రిజిస్ట్రేషన్ గడువు ముగిసే వరకు బ్యాటరీని మార్చాల్సిన అవసరం లేదు. ఏదేమైనప్పటికీ.. మీరు ఎలక్ట్రిక్ కారు కొనాలని నిర్ణయించుకున్నట్లయితే, బ్యాటరీ లైఫ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.