NTV Telugu Site icon

Bharat Mobility Expo: డియో లవర్స్‌కి శుభవార్త.. స్పోర్టీ లుక్స్, మంచి మైలేజ్‌..

Dio 2025

Dio 2025

హోండా తన పాపులర్ డియో స్కూటర్ యొక్క 2025 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.74,930గా నిర్ణయించింది. దీని ధర ప్రస్తుత మోడల్ కంటే దాదాపు రూ. 1500 ఎక్కువ. 2025 వెర్షన్‌లో జపాన్ కంపెనీ దానిలో పలు మార్పులు చేసింది. OBD2B కంప్లైంట్ ఇంజిన్‌ను అందించింది. ఈ 110cc సింగిల్-సిలిండర్ పాత మోడల్‌కు సమానమైన పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. CVT గేర్‌బాక్స్‌లో ఎలాంటి మార్పు లేదు. కంపెనీ తన మైలేజ్ కు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదు.

2025 డియో స్కూటర్ ఫీచర్లు..
ఇది 4.2-అంగుళాల టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. వేగం, ట్రిక్ మీటర్, రేంజ్ మొదలైనవాటితో పాటు మైలేజీని కూడా స్పష్టంగా చూపుతుంది. ఇందులో టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. ఇది స్టాండర్డ్ (STD), డీలక్స్ (DLX) అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. డీలక్స్ ధర రూ.85,648గా కంపెనీ తెలిపింది. ఎందుకంటే ఇందులో అన్ని ఫీచర్లతో పాటు మెరుగైన గ్రాఫిక్స్ కూడా ఉన్నాయి. కాగా.. దేశ వ్యాప్తంగా దీని బుకింగ్ ప్రారంభమయ్యాయి. ఈ నెలాఖరులో డెలివరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా.. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.74,930గా నిర్ధారించింది.

లుక్, డిజైన్ దాదాపు పాతదే?
లుక్, డిజైన్ పరంగా, ఇది చాలావరకు మునుపటి మాదిరిగానే ఉంది. దాని టాప్ డీలక్స్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్ అందించారు. ఇది కాకుండా.. ఈ స్కూటర్ మొత్తం 5 రంగులలో లభిస్తుంది. ఇందులో ఇంపీరియల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ + పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, మాట్ మార్వెల్ బ్లూ, మాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి.

కస్టమర్ల అవసరాలను తీరుస్తుంది..
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్, సీఈవో సుట్సుము ఒటాని మాట్లాడుతూ.. “హోండా డియోను స్పోర్టి లు,క్ శక్తివంతమైన పనితీరు కనబరిచే విధంగా కొత్త 2025 డియోను మునుపటి కంటే మెరుగ్గా చేశాం. చాలా కొత్త ఫీచర్లు ఇందులో చేర్చాం. ఈ స్కూటర్ కస్టమర్ల అవసరాలను తీరుస్తుందని కంపెనీ భావిస్తోంది” అని పేర్కొన్నారు.