NTV Telugu Site icon

Bharat Mobility Global Expo 2025: హీరో డబుల్ బ్లాస్ట్! రెండు శక్తివంతమైన స్కూటర్‌లు విడుదల..

Hero Motocorp

Hero Motocorp

హీరో మోటోకార్ప్ తన రెండు అద్భుతమైన స్కూటర్‌లు Xoom 160, Xoom 125లను భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్లు వాటి ఆకర్శణీయమైన డిజైన్‌తో పాటు శక్తి వంతమైన ఫీచర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. Xoom 125 ధర రూ. 86,900 (ఎక్స్-షోరూమ్), Xoom 160 ధర రూ. 1.48 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ధారించింది. ఈ రెండు స్కూటర్లు హీరో ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తాయని అభిప్రాయం. వాటి ప్రత్యేకతలను వివరంగా తెలుసుకుందాం..

Xoom 125 డిజైన్ , లుక్స్
హీరో జూమ్ 125 డిజైన్ సాధారణ స్కూటర్లకు పూర్తి భిన్నంగా ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఈడీ లైట్లు, టెయిల్ సెక్షన్‌తో కూడిన షార్ప్ ఫ్రంట్ ఆప్రాన్ దీనికి స్పోర్టీ అప్పీల్‌ని ఇస్తుంది. Xoom 125.. 125cc ఇంజిన్‌ను కలిగి ఉంది. 14-అంగుళాల టైర్లు అమర్చారు. ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, ఆల్-LED లైట్లు, స్క్రోల్-స్టైల్ టర్న్ ఇండికేటర్‌లను కలిగి ఉంది. ఇది డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. మంచి మైలేజ్ అందిస్తుంది. ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్ కలిగి ఉంది.

హీరో Xoom 160 డిజైన్ – ఫీచర్లు.. 
హీరో Xoom 160 అనేది బ్రాండ్ యొక్క మొదటి మ్యాక్సీ-స్కూటర్. ఇది అడ్వెంచర్ బైక్ డిజైన్‌ను పోలి ఉంది. దీని ఫ్రంట్ ప్రొఫైల్‌లో ఆకర్షణీయమైన స్ప్లిట్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు అమర్చారు. దీని బాడీ అడ్వెంచర్ స్కూటర్‌గా గుర్తింపునిస్తుంది. Xoom 160లో 156cc సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 8,000rpm వద్ద 14bhp శక్తిని, 6,500rpm వద్ద 13.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది CVT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. అంతే కాకుండా స్కూటర్‌లో ముందు టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇది 14-అంగుళాల చక్రాలు, ఫ్రంట్ డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంది. దీని బ్రేకింగ్ హార్డ్‌వేర్ చాలా బలంగా ఉన్నట్లు చెబుతున్నారు. కాగా.. Xoom 125, Xoom 160 లాంచ్‌తో ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో కూడా తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు హీరో చూపించింది. రూ. 86,900 (Xoom 125), రూ. 1.48 లక్షల (Xoom 160) ధరలతో ప్రారంభమయ్యే ఈ స్కూటర్లు డిజైన్, పనితీరు, ఫీచర్లు కస్టమర్లను ఆకర్శిస్తాయని కంపెనీ పేర్కొంది.