NTV Telugu Site icon

GST Council meeting: పాత వాహనాలు కొంటున్నారా? షాక్ ఇచ్చిన జీఎస్టీ కౌన్సిల్

Gstcouncilmeeting

Gstcouncilmeeting

దేశంలో పాత వాహనాల మార్కెట్ గణనీయంగా పెరిగింది. చాలా కంపెనీలు పాత వాహనాలను తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.. ఈ పాత వాహనాల విక్రయంపై విధించే పన్నుకు సంబంధించి కీలక సమాచారం వెలువడింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశంలో ఓ పెద్ద నిర్ణయం తీసుకున్నారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సహా పాత వాహనాల అమ్మకాలపై పన్ను పెంచడానికి అంగీకరించారు. జీఎస్టీ12 శాతం నుంచి 18 శాతానికి పెంచేందుకు అంగీకారం కుదిరింది.

READ MORE: Pawan Kalyan: పవన్ సర్కారులో భాగస్వామి అయ్యాడంటే.. ప్రతీ గిరిజన యువకుడు ప్రభుత్వంలో ఉన్నట్టే..

కంపెనీలు లేదా డీలర్లు విక్రయించే పాత కార్లకు సంబంధించిన లావాదేవీలపై మారిన జీఎస్టీ రేట్లు వర్తిస్తాయని కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. అంటే కౌన్సిల్ సవరించిన ఈ మార్పు మార్జిన్‌తో విక్రయించే, కంపెనీల నుంచి కొనుగోలు చేసే వాహనాలకు వర్తిస్తాయి. వ్యక్తుల నుంచి డైరెక్ట్‌గా కొనుగోలు చేస్తే.. 12 శాతం పన్ను మాత్రమే వర్తిస్తుంది. అంటే వ్యక్తిగత కొనుగోలుదారులు, అమ్మకందారులపై ఎటువంటి ప్రభావం ఉండదు.

READ MORE:Chennai: తల్లి క్యాన్సర్‌ చికిత్స కోసం దాచిన డబ్బులతో రమ్మీ ఆడిన కొడుకు.. చివరికీ..

ఎఫ్‌ఎం సీతారామన్‌ అధ్యక్షతన సమావేశం:
కాగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇందులో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కూడా ఉన్నారు. ఈ సమావేశంలో ఆరోగ్య బీమా, టర్మ్‌ జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయించాలని చర్చించారు. దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్‌లో సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. జీఎస్టీ తొలగించేందుకు నిర్ణయించింది. టర్మ్‌ పాలసీలు సహా పెద్దలు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీ రద్దు చేసేందుకు మంత్రుల బృందం సుముఖత వ్యక్తం చేసింది. సాధారణ వ్యక్తులు తీసుకునే రూ.5 లక్షలలోపు ఆరోగ్య బీమా పాలసీలపైనా జీఎస్టీని మినహాయించాలని, రూ.5 లక్షలు దాటిన ఆరోగ్య బీమా పాలసీలకు ప్రస్తుత 18 శాతం జీఎస్టీని కొనసాగించాలని నిర్ణయించింది. దీనిపై ఆరంభంలోనే చర్చించిన కౌన్సిల్‌.. ఈ అంశాన్ని వాయిదా వేసింది. మరింత లోతైన చర్చ అవసరమని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు మంత్రుల బృందానికి నేతృత్వం వహించిన బిహార్‌ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్‌ చౌధరి తెలిపారు. దీంతో సామాన్యులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇతర అంశాలపై మండలిలో చర్చ జరుగుతోంది.

Show comments