అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ ఇప్పటికే ఇండియాలో ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. కానీ.. రోజురోజుకు ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసేందుకు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) స్కీం కింద కేంద్రంను అనుమతులు కోరింది ఫోర్డ్. అయితే.. ఇటీవలే ఫోర్డ్ పీఎల్ఐ అప్లికేషన్‌కు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫోర్డ్ మళ్లీ ఇండియాలో కార్ల ఉత్పత్తి కొనసాగిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, భారత్‌లో విద్యుత్ కార్ల తయారీ ప్రణాళిక ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం వెల్లడించింది.
ఫోర్డ్ పీఎల్ఐ స్కీం కింద దేశంలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని ఎటువంటి ఆలోచన లేదని పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వానికి సమాచారమిచ్చింది. భారత్‌లోని ఉత్పాదక యూనిట్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయాలన్న ప్రణాళికపై చాలా సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది. తమ పీఎల్ఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు ఫోర్డ్.. ఇంతకుముందు తమ వ్యాపార ప్రణాళికలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు పేర్కొంది.