Site icon NTV Telugu

Car Prices Slash: పండుగ సీజన్‌కు ముందే శుభవార్త.. కార్లపై రూ. 60 వేల నుంచి 3.49 లక్షల వరకు తగ్గింపు!

Auto

Auto

Car Prices Slash: కేంద్రప్రభుత్వం ఇటీవల జీఎస్‌టీ రేట్లను క్రమబద్ధీకరించిన నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ కార్ల ధరలను గణనీయంగా తగ్గించాయి. కొత్త జీఎస్‌టీ విధానం సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి వస్తుంది. ఈ తగ్గింపులు ఎంట్రీ-లెవల్ కార్లపై రూ. 60,000 నుండి ప్రీమియం ఎస్‌యూవీలపై రూ. 3 లక్షలకు పైగా వరకు ఉన్నాయి. టాటా, మహీంద్రా, టయోటా, హ్యుందాయ్‌ వంటి ప్రధాన సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించగా.. త్వరలో కియా, మారుతి సుజుకీ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది.

కొత్త జీఎస్‌టీ ప్రకారం.. 1,200cc లోపు పెట్రోల్, ఎల్‌పీజీ లేదా సీఎన్‌జీ కార్లకు, అలాగే 1,500cc లోపు డీజిల్ కార్లకు 18% జీఎస్‌టీ వర్తిస్తుంది. అయితే, 1,200cc కంటే ఎక్కువ పెట్రోల్ కార్లకు, 1,500cc కంటే ఎక్కువ డీజిల్ కార్లకు 40% జీఎస్‌టీని వర్తింపజేయనున్నారు. ఈ మార్పుల వల్ల ఆటోమొబైల్ రంగంలో భారీ మార్పులు రానున్నాయి. మరి కంపెనీల వారీగా ఏ కారుపై ఎంత ధర తగ్గించారో చూద్దామా..

Manchu Manoj : మీరు నా వెనకాల ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు

టాటా మోటార్స్:
టాటా మోటార్స్ తన కార్లపై ధరలను తగ్గించింది. టియాగో రూ. 75,000, టిగోర్ రూ. 80,000, ఆల్ట్రోజ్ రూ. 1.10 లక్షల వరకు ఇదివరకు కంటే చౌకగా లభిస్తాయి. ఎస్‌యూవీల విషయానికి వస్తే, పంచ్ రూ. 85,000, నెక్సాన్ రూ. 1.55 లక్షలు, కర్వ్ రూ. 65,000, ప్రీమియం మోడళ్లైన హారియర్ రూ. 1.40 లక్షలు, సఫారి రూ. 1.45 లక్షల వరకు తగ్గించబడ్డాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా:
మహీంద్రా తన ఎస్‌యూవీల శ్రేణిలో ధరలను భారీగా తగ్గించింది. బొలెరో, బొలెరో నియోలు రూ. 1.27 లక్షల వరకు తగ్గాయి. ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ పెట్రోల్ రూ. 1.40 లక్షలు, డీజిల్ వేరియంట్ రూ. 1.56 లక్షలు తగ్గింది. థార్ 2డబ్ల్యూడీ డీజిల్ రూ. 1.35 లక్షలు, థార్ 4డబ్ల్యూడీ డీజిల్ మరియు స్కార్పియో క్లాసిక్ రూ. 1.01 లక్షలు తగ్గాయి. స్కార్పియో-ఎన్ ధర రూ. 1.45 లక్షలు, ఎక్స్‌యూవీ700 రూ. 1.43 లక్షలు తగ్గించబడింది.

టయోటా:
టయోటా తన కార్ల ధరలను భారీగా తగ్గించింది. ఫార్చ్యూనర్‌పై ఏకంగా రూ. 3.49 లక్షలు, లెజెండర్‌పై రూ. 3.34 లక్షలు, వెల్‌ఫైర్‌పై రూ. 2.78 లక్షలు, హైలక్స్‌పై రూ. 2.52 లక్షల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్‌లు రూ. 1.80 లక్షలు, రూ. 1.15 లక్షల వరకు ధరలు తగ్గాయి. గ్లాంజా రూ. 85,300, అర్బన్ క్రూజర్ హైరైడర్ రూ. 65,400 తగ్గించబడ్డాయి.

హ్యుందాయ్:
హ్యుందాయ్ తన అన్ని కార్ల మోడళ్లపై ధరలను తగ్గించింది. గ్రాండ్ ఐ10 నియోస్ రూ. 73,808, ఐ20 రూ. 98,053, ఐ20 ఎన్ లైన్ రూ. 1.08 లక్షలు తగ్గాయి. సెడాన్లలో ఆరా రూ. 78,465, వెర్నా రూ. 60,640 చౌకగా మారాయి. ఎక్స్‌టర్ రూ. 89,209, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్ రూ. 1.23 లక్షల వరకు తగ్గాయి. క్రెటా, క్రెటా ఎన్ లైన్‌లపై రూ. 72,000, అల్కాజర్‌పై రూ. 75,376, టక్సన్‌పై రూ. 2.40 లక్షల వరకు తగ్గింపు లభించింది.

Crime News: అంబర్ పేట్‌లో దారుణం.. భార్యపై కన్నేశాడని స్నేహితుడిని..!

రెనాల్ట్:
రెనాల్ట్ తన మూడు మోడళ్లపై జీఎస్‌టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించింది. క్విడ్, ట్రైబర్, కైగర్‌లపై రూ. 96,395 వరకు తగ్గింపును అందించింది.

Exit mobile version