ఇటీవలే కియా సిరోస్ (Kia Syros EV) ఇండియాకు వచ్చేసింది. ఈ కారు పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో లాంచ్ చేశారు. ఇందులో చాలా గొప్ప ఫీచర్లు ఉన్నాయి. ఈ క్రమంలో.. ఆల్-ఎలక్ట్రిక్ వేరియంట్ కియా సిరోస్ ఈవీ కూడా తర్వలో లాంచ్ కానుంది. 2026 నాటికి ఇండియాలో ప్రారంభించనున్నారు. కియా సిరోస్ ఈవీ వస్తే అందులో ఎలాంటి మార్పులు చూడవచ్చో తెలుసుకుందాం….
Read Also: Hyderabad: వాహనంలో గంజాయి సరఫరాపై ఖండించిన ఐకియా..
డిజైన్
కియా సిరోస్ ఈవీ డిజైన్.. ఐసీఈ (ICE) వేరియంట్‌కు దగ్గరగా ఉంటుంది. ఇది K1 ప్లాట్‌ఫారమ్‌ను కలిగి ఉండవచ్చు. అయితే కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ కారు వలె మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. ఎల్ఈడీ లైట్ల విషయానికొస్తే.. 3-పాడ్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, L-ఆకారపు ఎల్ఈడీ టైల్‌లైట్లు, ఎల్ఈడీ DRLలు వంటి డిజైన్ ఎలిమెంట్‌లను ఇందులో చూడవచ్చు. అలాగే.. ఈ కారుకు ముందు, వెనుక బంపర్‌లను మరింత ఏరోడైనమిక్‌గా.. ఎలక్ట్రిక్ కారు అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయవచ్చు. ఇంటీరియర్ విషయానికొస్తే.. ఈ కారు క్యాబిన్ డిజైన్ ఒకే విధంగా ఉంచవచ్చు. లోపల విభిన్నమైన అప్హోల్స్టరీ, రంగులను చూడవచ్చు. దీంతో ఈ కారు మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
ఫీచర్లు
సిరోస్ ఈవీ ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. డ్యూయల్ 12.3-అంగుళాల స్క్రీన్‌లు.. ఒక స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ డిస్‌ప్లే కోసం, డ్యాష్‌బోర్డ్‌కు హైటెక్ రూపాన్ని ఇస్తుంది. ఇంటిగ్రేటెడ్ క్లైమేట్ కంట్రోల్.. రెండు జోన్‌ల కోసం క్లైమేట్ కంట్రోల్ సెట్టింగ్‌ల కోసం 5 అంగుళాల స్క్రీన్‌ని చూడవచ్చు. పవర్-అడ్జస్టబుల్ సీట్లు.. డ్రైవర్ సీటు 4-వే పవర్ సర్దుబాటుతో కలిగి ఉంటుంది. లగ్జరీ చేర్పుల విషయానికొస్తే.. 64 రంగు ఆంబీఎంట్ లైటింగ్.. ముందు, వెనుక సీట్ల కోసం వెంటిలేషన్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పనోరమిక్ సన్‌రూఫ్, 8-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉండవచ్చు.
సెక్యూరిటీ ఫీచర్లు
కియా కంపెనీ తమ కార్లలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తుంది.. ఈ క్రమంలో సిరోస్ ఈవీలో అధునాతన భద్రతా లక్షణాలను చూడవచ్చు. ఈ కారులో ఎలాంటి భద్రతా ఫీచర్లు ఉండనున్నాయో తెలుసుకుందాం. ప్రయాణీకులందరి భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు.. 360-డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) రేంజ్, బ్యాటరీ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. కియా సిరోస్ ఈవీ ఎప్పుడు లాంచ్ అవతుంతో తెలియనప్పటికీ.. ఈ కారు 400 కిలోమీటర్ల పరిధిని అందించగలదని ఊహిచవచ్చు.