NTV Telugu Site icon

Ducati DesertX Discovery: మార్కెట్‌లోకి డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ బైక్.. ధర తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Ducati

Ducati

అడ్వెంచర్ బైక్ లవర్స్ కు కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. ఇటాలియన్ టూవీలర్ తయారీ సంస్థ కొత్త బైక్‌ డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పవర్‌ఫుల్, స్టైలిష్ అడ్వెంచర్ బైక్‌గా యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైక్‌ను కంపెనీ శక్తివంతమైన ఇంజిన్, క్రేజీ ఫీచర్లతో విడుదల చేసింది. అయితే ఈ బైక్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.78 లక్షల ప్రారంభ ధరతో రిలీజ్ చేసింది.

Also Read:CPM: మోడీ-ఆర్ఎస్ఎస్‌ను ‘‘ఫాసిస్టులు’’గా పిలువం.. సీపీఎం నిర్ణయంపై రాజకీయ వివాదం..

డుకాటీ డెసర్ట్‌ఎక్స్ స్పెసిఫికేషన్లు

డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ బైక్‌లో కంపెనీ 937 సిసి సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించింది. దీని కారణంగా బైక్ 110hpతో పాటు 92 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడింగ్ కోసం, ఆఫ్-రోడింగ్ మోడ్, విల్లీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి డ్రైవింగ్ మోడ్‌లను ఈ బైక్‌లో అందించారు. ఈ బైక్‌ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Also Read:Ponnam Prabhakar : అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలి

డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ బైక్‌ 21-లీటర్ ఫ్యుయల్ ట్యాంక్, హీటెడ్ గ్రిప్, బిగ్ విండ్‌షీల్డ్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఫ్రంట్ బుల్ బార్ ప్రొటెక్షన్, ప్రొటెక్టివ్ రేడియేటర్ గ్రిల్, ఇంజిన్ గార్డ్ ప్లేట్, సెంట్రల్ స్టాండ్‌ల ఫీచర్లను కలిగి ఉంది. వీటితో పాటు క్రూయిజ్ కంట్రోల్, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, USD ఫ్రంట్ ఫోర్కులు, KYB వెనుక మోనోషాక్ సస్పెన్షన్, ముందు, వెనక చక్రాలలో డిస్క్ బ్రేక్‌లతో కూడిన స్పోక్డ్ వీల్స్ అందించారు.