Car Sales Record: దేశంలో కార్ల అమ్మకాల్లో ఆల్ టైం రికార్డ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
September 2022 car sales record an all-time high in India: దేశంలో కార్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత కార్ల అమ్మకాలు ఆల్ టైం రికార్డ్ సేల్స్ నమోదు చేశాయి. గత రెండేళ్లుగా క్షీణిస్తూ వస్తున్న ప్యాసింజర్ వాహనాల విక్రయాలు మళ్లీ పూర్వస్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 2022 అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ అయింది. సెప్టెంబర్ నెలలో మొత్తంగా 3,55,946 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. ఇది అంతకుముందు నెల ఆగస్టు సేల్స్ 2,81,210 యూనిట్లతో పోలిస్తే 26 శాతం వృద్ధిని నమోదు అయింది.
సెప్టెంబర్ నెల కార్ల అమ్మకాలు జూలై నెలలోని 3,41,370 యూనిట్ల అమ్మకాల కన్నా 4 శాతం అధికం. అలాగే కోవిడ్ ముందు 2020 అక్టోబర్ నెలలో కార్ల అమ్మకాలతో పోలిస్తే 6.5 శాతం అధికంగా ఉంది. అక్టోబర్ 2020లో మొత్తంగా 3,34,411 యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి, 2021 లో అమ్ముడైన 3,16,034 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ 2022 అమ్మకాలు 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021 సెప్టెంబర్ నెలలో 1,60,070 కార్ల అమ్మకాలతో పోలిస్తే..2022 సెప్టెంబర్ లో ఏకంగా 122 శాతం వృద్ధి నమోదు అయింది. ఇదే విధంగా సెప్టెంబర్ 2020లో 2,72,027 కార్ల అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అమ్మకాలు 30 శాతానికి పెరిగాయి.
Also Read
- Electric Scooters: ఓలా, టీవీఎస్ ఐక్యూబ్, హీరో విడా.. వీటిలో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ బెస్ట్? పూర్తి వివరాలు
- Tata Tiago EV vs MG Comet EV: టాటా టియాగో EV వర్సెస్ ఎంజీ కామెట్ EV.. రూ.7 లక్షల బడ్జెట్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
- Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
- Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
Read Also: Ramya Krishnan: నాలుగు నెలల కడుపుతో ఉన్నా ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేశా
ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. మధ్యతరగతి వర్గాలు కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. దీంతోనే అన్ని ప్రముఖ కార్ల కంపెనీలకు ఇబ్బడిముబ్బదిగా బుకింగ్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే సెమీకండక్టర్ల కొరత కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తోంది. దీని కారణంగా కొన్ని కార్లపై వెయిటింగ్ పిరియడ్ ఐదారు నెలల కన్నా ఎక్కువగా ఉంటోంది.
గత నెలలో కార్ల అమ్మకాలకు సంబంధించి మొత్తం 16 కార్ల తయారీ కంపెనీల్లో 11 కార్లకంపెనీలు తమ సేల్స్ ను విడుదల చేశాయి. అయితే రెనాల్ట్ ఇండియా, ఎఫ్‌సిఎ ఇండియా, పిసిఎ మోటార్స్ ఇండియా, ఫోర్స్ మోటార్స్, ఇసుజు మోటార్ ఇండియా తమ సెప్టెంబర్ 2022 అమ్మకాలను ఇంకా విడుదల చేయలేదు.
తాజావార్తలు
-
Gender Determination Racket : చిత్తూరు జిల్లాలో అక్రమ లింగ నిర్ధారణ రాకెట్ గుట్టురట్టు..
-
Kohli-Venkatesh Iyer: ఐపీఎల్ ఫైనల్లో మొదటిసారిగా.. అరుదైన రికార్డు సాధించిన కోహ్లీ, వెంకటేష్ అయ్యర్..
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Samsung Galaxy F70e 5G: సామ్ సంగ్ గెలాక్సీ F70e 5Gపై భారీ డిస్కౌంట్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!