NTV Telugu Site icon

Car Sales Record: దేశంలో కార్ల అమ్మకాల్లో ఆల్ టైం రికార్డ్..

Record Car Sales In India

Record Car Sales In India

September 2022 car sales record an all-time high in India: దేశంలో కార్ల అమ్మకాల జోరు కొనసాగుతోంది. కోవిడ్ మహమ్మారి తర్వాత కార్ల అమ్మకాలు ఆల్ టైం రికార్డ్ సేల్స్ నమోదు చేశాయి. గత రెండేళ్లుగా క్షీణిస్తూ వస్తున్న ప్యాసింజర్ వాహనాల విక్రయాలు మళ్లీ పూర్వస్థాయికి చేరుకున్నాయి. సెప్టెంబర్ 2022 అమ్మకాల్లో రికార్డ్ క్రియేట్ అయింది. సెప్టెంబర్ నెలలో మొత్తంగా 3,55,946 యూనిట్ల అమ్మకాలు నమోదు అయ్యాయి. ఇది అంతకుముందు నెల ఆగస్టు సేల్స్ 2,81,210 యూనిట్లతో పోలిస్తే 26 శాతం వృద్ధిని నమోదు అయింది.

సెప్టెంబర్ నెల కార్ల అమ్మకాలు జూలై నెలలోని 3,41,370 యూనిట్ల అమ్మకాల కన్నా 4 శాతం అధికం. అలాగే కోవిడ్ ముందు 2020 అక్టోబర్ నెలలో కార్ల అమ్మకాలతో పోలిస్తే 6.5 శాతం అధికంగా ఉంది. అక్టోబర్ 2020లో మొత్తంగా 3,34,411 యూనిట్లు అమ్ముడయ్యాయి. మార్చి, 2021 లో అమ్ముడైన 3,16,034 యూనిట్లతో పోలిస్తే సెప్టెంబర్ 2022 అమ్మకాలు 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021 సెప్టెంబర్ నెలలో 1,60,070 కార్ల అమ్మకాలతో పోలిస్తే..2022 సెప్టెంబర్ లో ఏకంగా 122 శాతం వృద్ధి నమోదు అయింది. ఇదే విధంగా సెప్టెంబర్ 2020లో 2,72,027 కార్ల అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో అమ్మకాలు 30 శాతానికి పెరిగాయి.

Read Also: Ramya Krishnan: నాలుగు నెలల కడుపుతో ఉన్నా ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేశా

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో కార్ల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. మధ్యతరగతి వర్గాలు కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. దీంతోనే అన్ని ప్రముఖ కార్ల కంపెనీలకు ఇబ్బడిముబ్బదిగా బుకింగ్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే సెమీకండక్టర్ల కొరత కార్ల ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపిస్తోంది. దీని కారణంగా కొన్ని కార్లపై వెయిటింగ్ పిరియడ్ ఐదారు నెలల కన్నా ఎక్కువగా ఉంటోంది.

గత నెలలో కార్ల అమ్మకాలకు సంబంధించి మొత్తం 16 కార్ల తయారీ కంపెనీల్లో 11 కార్లకంపెనీలు తమ సేల్స్ ను విడుదల చేశాయి. అయితే రెనాల్ట్ ఇండియా, ఎఫ్‌సిఎ ఇండియా, పిసిఎ మోటార్స్ ఇండియా, ఫోర్స్ మోటార్స్, ఇసుజు మోటార్ ఇండియా తమ సెప్టెంబర్ 2022 అమ్మకాలను ఇంకా విడుదల చేయలేదు.