Site icon NTV Telugu

BYD Yangwang U8: క్వాలిటీ చెక్ అంతే ఇది గురూ.. కారుపై మూడు సార్లు పడ్డ తాటి చెట్టు.. అయినా..?

Byd Yangwang U8

Byd Yangwang U8

BYD Yangwang U8: చైనాకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ BYD (Build Your Dreams) ఈ మధ్య కాలంలో ఆటోమొబైల్ రంగంలో దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ తమ వాహనాల పటిష్టతను, భద్రతను నిరూపించడానికి ఓ సాహసోపేతమైన, వినూత్నమైన ప్రయోగాన్ని నిర్వహించింది. సాధారణంగా ఒక పెద్ద చెట్టు కారుపై పడితే తీవ్ర నష్టం జరుగుతుంది. అయితే ఈ ప్రయోగంలో జరిగిన సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.

Local Body Elections: పంచాయతీ ఎన్నికల వేళ ‘వరాల జల్లులు’.. ఇంటికి రూ.5 లక్షల బీమా, పెళ్లికి పుస్తె మెట్టెలు ఇంకా ఎన్నో..!

150,000 డాలర్స్ విలువైన లగ్జరీ ఎలక్ట్రిక్ SUV అయిన Yangwang U8 కారుపై ఏకంగా 141 అడుగుల పొడవైన భారీ తాటి చెట్టును మూడు సార్లు పడేసి టెస్ట్ చేశారు. ఈ ప్రయోగం విఫలమయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఫలితం మాత్రం ఎవరు ఊహించని విధంగా ఉంది. చెట్టును కారు దగ్గరగా నిలబెట్టి.. ఆ తర్వాత వదిలివేయగా, అది నేరుగా Yangwang U8 కారు పైకప్పుపై (Roof) పడింది. అది ఒక్కసారి కాదు.. మూడు సార్లు ఈ భారీ చెట్టు పడినా కూడా ఆ కారు అద్భుతంగా తట్టుకుంది. ఈ ఘటనలో కారుకు క్యాబిన్‌లో, తలుపులకు, అద్దాలు కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు. అయితే చెట్టు పడిన చోట మాత్రం కాస్త ఒత్తుకున్నట్లుగా కనపడుతుంది. ఈ విధంగా కారు పటిష్టత, భద్రతను BYD Yangwang U8 నిరూపించింది.

Kane Williamson Return: లాంగ్ లాంగ్ బ్రేక్ తర్వాత ఎంట్రీ.. చరిత్ర సృష్టించిన కేన్ మామ!

ఇక BYD Yangwang U8 కారుకు సంబంధించిన కీలక సాంకేతిక వివరాల విషయానికి వస్తే.. క్వాడ్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ పవర్‌ట్రైన్, 124 mph టాప్ స్పీడ్, 0-62 mph వేగం కేవలం 3.6 సెకన్లలలో అందుకుంటుంది. ఇందులో ‘ఐస్ & స్నో’, ‘డెసర్ట్/సాండ్’, ‘ఫిక్స్‌డ్ సర్కిల్’, ‘ఫ్లోటింగ్/వాటర్’ అనే డ్రైవ్ మోడ్స్ ఉంటాయి.

Exit mobile version