BMW iX3 SUV: ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచం వేగంగా మారుతోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం బ్యాటరీలు, ఛార్జింగ్ వరకే పరిమితం కాకుండా.. స్మార్ట్ టెక్నాలజీ, డిజిటల్ ఫీచర్లు, కనెక్టెడ్ సిస్టమ్స్‌తో “రోడ్లపై పరుగెత్తే కంప్యూటర్లుగా” మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే CES 2026 (Consumer Electronics Show) వేదికగా బీఎండబ్ల్యూ గ్రూప్ తన కొత్త ఎలక్ట్రిక్ SUV BMW iX3ను ఆవిష్కరించేందుకు రెడీ అయింది.
Read Also: Varanasi : ‘వారణాసి’ బడ్జెట్‌పై నోరు విప్పిన ప్రియాంక.. ఒక్కసారిగా హీటెక్కిన సోషల్ మీడియా!
అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్‌లలో ఒకటైన CESను, ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ వాహనాల్లోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి వేదికగా ఉపయోగిస్తున్నాయి. లాస్ వెగాస్‌లోని సిల్వర్ లాట్‌లోని BMW బూత్‌లో కొత్త BMW iX3ను ప్రదర్శించనున్నారు.
Read Also: Chat GPT & Deep Seek:ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం సంచలన ఆదేశాలు
Neue Klasse ప్లాట్‌ఫామ్‌పై తొలి మోడల్
BMW iX3 కంపెనీకి అత్యంత కీలకమైన వెహికిల్.. ఇది కొత్తగా రూపొందించిన Neue Klasse ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న ఫస్ట్ మోడల్.. ఈ ప్లాట్‌ఫామ్ ఎలక్ట్రిఫికేషన్, డిజిటల్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ సాఫ్ట్‌వేర్ అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టింది. 2027 నాటికి ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా సుమారు 40 అప్‌డేటెడ్ మోడళ్లను తీసుకురావాలని BMW లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా iX3 ఒక ప్రివ్యూ మోడల్‌గా నిలవబోతుంది.
Read Also: Muhammad Yunus: ‘‘హాది కలను నెరవేరుస్తాం’’.. భారత వ్యతిరేకికి మద్దతుగా యూనస్ వ్యాఖ్యలు..
కొత్త Panoramic iDrive
BMW iX3లో ప్రధాన ఆకర్షణగా కొత్త Panoramic iDrive సిస్టమ్ నిలవనుంది. సంప్రదాయ డాష్‌బోర్డుల్లో కనిపించే బటన్‌ల గందరగోళానికి బదులు, ఇది విస్తృతమైన, స్పష్టమైన డిస్‌ప్లేను, లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉండనుంది. ఈ సిస్టమ్ BMW యొక్క Intelligent Personal Assistantతో కలిసి పని చేస్తుంది. డ్రైవర్లు కారుతో సహజంగా మాట్లాడగలిగే విధంగా ఇది రూపొందించబడింది. ఉదాహరణకు, “నాకు చలిగా ఉంది” అని చెప్పినప్పుడు, కారు సొంతంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. ఈ ఫీచర్‌ను BMW ఇందులో ప్రత్యేకంగా ప్రవేశ పెట్టింది.
Alexa+తో భాగస్వామ్యం
BMW తాజాగా అమెజాన్‌తో కీలక భాగస్వామ్యం చేసుకుంది. దీని ద్వారా **Alexa+**ను ప్రొడక్షన్ కారులో ప్రవేశ పెట్టిన తొలి కార్ తయారీదారుగా BMW నిలిచింది. Alexa+ అనేది అమెజాన్ వాయిస్ అసిస్టెంట్‌కు మరింత అడ్వాన్స్‌డ్ వెర్షన్. ఇది క్లిష్టమైన, పరిస్థితికి అనుగుణమైన అభ్యర్థనలను కూడా అర్థం చేసుకుంటుంది. డ్రైవింగ్ సమయంలో స్క్రీన్‌లను తాకడం లేదా బటన్‌లు నొక్కే అవసరం లేకుండా ఇది పని చేస్తుంది. CES 2026 సందర్భంగా వెనిషియన్ హోటల్‌లోని Amazon Devices & Services ఎగ్జిబిట్లో కూడా ఈ టెక్నాలజీని సందర్శకులు వీక్షించారు.
కాన్సెప్ట్ నుంచి రియాలిటీకి
CES 2023లో conversational AIపై దృష్టి సారించిన i Vision Dee కాన్సెప్ట్ను BMW నజర్ పెట్టింది. అనంతరం CES 2025లో Panoramic iDrive డిస్‌ప్లే కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తుంది. ఇప్పుడు CES 2026లో, నూతన సాంకేతికను తీసుకొస్తుంది. ఓవరాల్ గా ఈ BMW iX3 ఎలక్ట్రిక్ కార్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మోడల్‌గా నిలవనుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
