Site icon NTV Telugu

BMW C 400 GT: స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్.. ధర తెలిస్తే గుండె గుభేలే

Bmw

Bmw

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ బ్రాండ్ BMW Motorrad తన ప్రీమియం మాక్సీ స్కూటర్ ను రిలీజ్ చేసింది. కొత్త మ్యాక్సీ స్కూటర్ C 400 GT ని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టైలిష్ లుక్, స్మార్ట్ ఫీచర్లతో బీఎమ్ డబ్ల్యూ కొత్త స్కూటర్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. ఈ స్కూటర్ ధర తెలిస్తే గుండె గుభేలు అవడం ఖాయం. BMW C 400 GT ప్రారంభ ధర రూ. 11,50,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ నిర్ణయించింది.

Also Read:Jana Sena: జనసేన ఆవిర్భావ సభకు మహిళలకు ప్రత్యేక ఆహ్వానం.. ఇంటింటికీ వెళ్లి….

2025 మోడల్ కొత్త పెయింట్ స్కీమ్ మరియు మరిన్ని ఫీచర్లతో స్టాండర్డ్‌గా వస్తుంది. BMW స్కూటర్‌కు కొత్త విండ్‌స్క్రీన్‌ను అందించింది. ఇది రైడర్‌ను గాలి నుంచి కాపాడుతుంది. దీనికోసం కంపెనీ సీటు ఎత్తును 10mm తగ్గించింది. ఈ స్కూటర్‌లో కంపెనీ 350 సిసి సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అందించింది. ఇది 33.5 bhp శక్తిని, 35 న్యూటన్ మీటర్ల (Nm) టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Also Read:CM Revanth Reddy: బీఆర్ఎస్‌కి పురుడు పోసింది కొండా లక్ష్మణ్ బాపూజీ.. కానీ పార్టీ ఏం చేసింది?

కంపెనీ దీనిలో 12.8 లీటర్ల ఫ్యుయల్ ట్యాంక్‌ను అందించింది. దీని మొత్తం బరువు 214 కిలోలు. C 400 GT స్కూటర్ ముందు భాగంలో 15-అంగుళాల అల్లాయ్ వీల్, వెనుక భాగంలో 14-అంగుళాల అల్లాయ్ వీల్ ఉన్నాయి. ఇది కాకుండా, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో ప్రీలోడ్-అడ్జస్టబుల్ డ్యూయల్-స్ప్రింగ్ సస్పెన్షన్ అందించారు.

Also Read:Nidhhi Agerwal : మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన పవన్ హీరోయిన్ !

ఫీచర్ల విషయానికి వస్తే.. లీన్-సెన్సిటివ్ ABS ప్రో, డైనమిక్ బ్రేక్ కంట్రోల్ (DBC), డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC), ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ (MSR) వంటి అధునాతన ఫీచర్లు అందించారు. దీనితో పాటు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన 10.25-అంగుళాల TFT స్క్రీన్, USB-C ఛార్జింగ్ పోర్ట్ అమర్చారు. 37.6 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.

Exit mobile version