Site icon NTV Telugu

ఆటోమొబైల్ మార్కెట్ ను షేక్ చేయనున్న Bajaj.. రాబోయే నాలుగు నెలల్లో ఎనిమిది లాంచ్‌లు!

Bajaj Pulsar

Bajaj Pulsar

Bajaj: బజాజ్ ఆటో నుంచి బైక్ ప్రేమికులకు అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. రాబోయే 4-5 నెలల్లో కంపెనీ ఎనిమిది కొత్త మోటార్‌ సైకిళ్లను మార్కెట్‌ లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇందులో కొత్త మోడళ్లతో పాటు అప్డేటెడ్ వెర్షన్లు, కొత్త వేరియంట్లు కూడా ఉండనున్నాయి. ఇందులో ముఖ్యంగా కంపెనీ దృష్టి మొత్తం పల్సర్ (Pulsar) సిరీస్‌పై ఉన్నట్లు సమాచారం.

Best Gadget Under రూ.300: బెస్ట్ గ్యాడ్జెట్.. ఈ చిన్న మిషన్ చేసే మ్యాజిక్ చూడండి!

దీపావళి 2025 తర్వాత బజాజ్ ఇప్పటికే పల్సర్ 125, పల్సర్ 150 మోడళ్లను అప్‌డేట్లతో విడుదల చేసింది. ఇక నుంచి ప్రతి నెలకు సుమారు రెండు లాంచ్‌ లతో పూర్తి స్థాయి రిఫ్రెష్ లైనప్‌ను అందించాలనే లక్ష్యంతో కంపెనీ దూకుడుగా వ్యవజరించనుంది. ముఖ్యంగా 150cc, అంతకంటే ఎక్కువ సెగ్మెంట్‌లో పల్సర్ బ్రాండ్ బలాన్ని మరింత కొనసాగించడం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం.

పవర్, లగ్జరీ, ఆఫ్‌రోడ్ సామర్థ్యం ఒకే కారులో.. MG Majestor ఆవిష్కరణ!

కంపెనీ ప్రణాళికల్లో భాగంగా పల్సర్ 220F, పల్సర్ 150, పల్సర్ 125 వంటి మోడళ్లకు మరిన్ని అప్డేట్లు రానున్నట్లు సమాచారం. అదేవిధంగా పల్సర్‌ కు తక్కువ సెగ్మెంట్‌ గా ఉండేలా ప్రత్యేక 125cc బ్రాండ్‌ను రూపొందించే ఆలోచనలో కూడా బజాజ్ ఉంది. ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించే ఎంట్రీ-లెవల్ ఆప్షన్‌గా ఉండనుంది. అలాగే డోమినార్ (Dominar) సిరీస్‌ను కూడా మరింత విస్తరించాలనే ప్రణాళిక కంపెనీకి ఉంది. ముఖ్యంగా మెక్సికో వంటి ఎగుమతి మార్కెట్లపై దృష్టి పెట్టనుంది. అలాగే డ్యూయల్-స్పోర్ట్, ఆఫ్-రోడ్ మోటార్‌సైకిళ్లను కూడా అభివృద్ధి చేస్తోంది.

Exit mobile version