బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రపంచంలోనే అతిపెద్ద త్రీ-వీలర్ తయారీదారుగా కొనసాగుతోంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా అడ్వాన్డ్స్ ఫీచర్లతో వెహికల్స్ ను తీసుకొస్తోంది. తాజాగా బజాజ్ కంపెనీ ప్యాసింజర్, కార్గో వేరియంట్లలో బజాజ్ గోగోను విడుదల చేసింది. బజాజ్ గోగో పేరుతో కొత్త ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బ్రాండ్‌ను ప్రారంభించింది. ఇవాళ లక్నోలో P5009, P5012, P7012 అనే మూడు వేరియంట్లలో తన ప్రత్యేక ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ బ్రాండ్ బజాజ్ గోగోను ప్రారంభించింది.
Also Read:Konda Surekha: జోగులాంబ ఆలయ పూజారిపై క్రిమినల్ కేసులు.. విచారణకు మంత్రి కొండా సురేఖ ఆదేశం
‘P’ అంటే ప్యాసింజర్ వాహనాలను సూచిస్తుంది. ’50’, ’70’ వాహన పరిమాణాన్ని సూచిస్తాయి. ’09’, ’12’ 9 kWh, 12 kWh బ్యాటరీ సామర్థ్యాన్ని సూచిస్తాయి. బజాజ్ గోగో P5009, P7012 ధరలు వరుసగా రూ. 3,26,797, రూ. 3,83,004 (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. TecPac హిల్ హోల్డ్ అసిస్ట్, యాంటీ-థెఫ్ట్ అలర్ట్, పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లతో వస్తుంది. గోగో సిరీస్ ఆటో హజార్డ్ వార్నింగ్ సిస్టమ్, యాంటీ-రోల్ డిటెక్షన్ వంటి సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లతో వస్తుంది. బజాజ్ గోగో P5009 ఆటో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 171 కి.మీ.లు ప్రయాణిస్తుంది. P5012 ఆటో 251 కి.మీ.లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది.
గరిష్ట వేగం గంటకు 45 కి.మీ నుంచి 50 కి.మీ. పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ (PMS) మోటారుతో నడిచే ఈ బేస్ మోడల్ 4.5 kW పీక్ పవర్, 36 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. P5012 వెర్షన్ 5.5 kW 36 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో హెలికల్ కాయిల్ స్ప్రింగ్‌తో స్వింగ్ ఆర్మ్, డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ, గ్లోవ్ బాక్స్, USB టైప్ A సపోర్ట్‌తో మొబైల్ ఛార్జర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.