NTV Telugu Site icon

Audi Q5 Bold Edition: మరో విలాసవంతమైన కారు విడుదల చేసిన ఆడి ..6.1 సెకన్లలో 100km/h వేగం..

Audi Q5 Bold Edition (2)

Audi Q5 Bold Edition (2)

ఆడి కంపెనీ ఇటీవల ఆడి క్యూ7 బోల్డ్ ఎడిషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్‌ను ను కూడా భారత్ లో లాంఛ్ చేసింది. ఈ కారును పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది. ఈ కారు రూ. 72.3 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఆడికి చెందిన ఈ కారు చాలా లగ్జరీ ఫీచర్లతో రాబోతోంది. అందులో విశేషమేమిటో తెలుసుకుందాం… ఈ కారు డిజైన్ అద్భుతంగా ఉంది. ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్ బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో వస్తుంది. అంటే ఫ్రంట్ గ్రిల్, బయటి రియర్‌వ్యూ మిర్రర్, విండో సరౌండ్, రూఫ్ రైల్ హైగ్లోస్ బ్లాక్‌లో ఫినిష్ చేయబడ్డాయి. దీనితో పాటు.. 19 అంగుళాల టైర్లతో పాటు డంపర్ కంట్రోల్‌తో కూడిన సస్పెన్షన్ సిస్టమ్‌ను ఇందులో అమర్చారు. ఈ కారు తెలుపు, నలుపు (గ్లేసియర్ వైట్), నీలం (నవర్రా బ్లూ), డిస్ట్రిక్ట్ గ్రీన్ మరియు మాన్‌హాటన్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంది.

READ MORE: Rakul Preet Brother: షాకింగ్: డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్

కారు ఇంటీరియర్ గురించి వివరాలు…
ఇంటీరియర్ గురించి చెప్పాలంటే.. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్, ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, మూడు-జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి. ప్రజల భద్రత కోసం పార్క్ అసిస్ట్, 8 ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా.. 19-స్పీకర్ బ్యాంగ్ మరియు ఒలుఫ్సెన్ మ్యూజిక్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందించారు. ఈ కారు 2.0-లీటర్ టీఎఫ్ఎస్ఐ (TFSi) పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇందులో ఏడు-స్పీడ్ డీసీటీ (DCT) గేర్‌బాక్స్ మరియు క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ అమర్చారు. దీని ఇంజన్ 261బీహెచ్‌పీ పవర్.. 370ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు 6.1 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 240 కి.మీగా కంపెనీ పేర్కొంది.

READ MORE: Puja khedkar: ట్రైనీ ఐఏఎస్ పూజా తల్లిదండ్రులపై ఎఫ్‌ఐఆర్.. పరారీలో పేరెంట్స్!

ఆడి క్యూ5 బోల్డ్ ఎడిషన్ ఫీచర్లు..
క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్
48.26 సెం.మీ (R19) ఆడి స్పోర్ట్ 5-ఆర్మ్ పైలాన్ స్టైల్ వీల్స్
డంపర్ నియంత్రణతో సస్పెన్షన్ సిస్టమ్
ఎల్ఈడీ(LED) హెడ్‌ లైట్లు
ఆరు డ్రైవ్ మోడ్‌లు (కంఫర్ట్, డైనమిక్, ఇండివిజువల్, ఎఫిషియన్సీ, ఆటో మరియు ఆఫ్-రోడ్)
పనోరమిక్ సన్‌రూఫ్..
360° కెమెరాతో పార్క్ అసిస్ట్ ..
డ్రైవర్ మెమరీతో పవర్ ఫ్రంట్ సీట్లు..
ఆడి వర్చువల్ కాక్‌పిట్ ప్లస్ సిస్టమ్..
ఆడి స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌ఫేస్..
ఎంఎంఐ (MMI) టచ్ రెస్పాన్స్‌తో ఎంఎంఐ (MMI) నావిగేషన్ ప్లస్..
వైర్‌లెస్ ఛార్జింగ్‌తో కూడిన ఆడి ఫోన్ బాక్స్..
3-జోన్ ఎయిర్ కండిషనింగ్..
యాంబియంట్ లైటింగ్ ప్యాకేజీ ప్లస్..
ఆడి జెన్యూన్ యాక్సెసరీస్ ..