Ather: ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ. 20,000 వరకు ఆదా..

  • ఏథర్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్..
  • రూ. 20,000 వరకు ఆదా చేసుకునే అవకాశం..
Ather

Ather

Ather: ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ ఏథర్ తన అమ్మకాలతో దూసుకుపోతోంది. ఇటీవల కాలంలో నమ్మకమైన టూ వీలర్ ఈవీగా పేరు తెచ్చుకుంది. ఇందుకు తగ్గట్లుగా అమ్మకాలు జోరు కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఏథర్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారికి బ్రహ్మాండమైన న్యూస్ చెప్పింది. Rizta S, 450S లపై పరిమిత కాల ప్రయోజనాలను అందించింది. దీని వలన వినియోగదారులు మార్చి 2026 వరకు రూ. 20,000 వరకు ఆదా చేసుకోవచ్చు. భారత్ అంతటా ఉన్న ఏథర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. PM E-డ్రైవ్ సబ్సిడీ ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఏథర్ ఈ ఆఫర్ ప్రకటించింది.

Read Also: North Korea: కుమార్తెకు గన్ ఫైర్ నేర్పిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. కారణం ఇదేనా..?

డిస్కౌంట్ ప్యాకేజీ మూడు భాగాలుగా విభజించబడింది. రూ. 10,000 క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్, రూ. 6500 క్యాష్ డిస్కౌంట్, రూ. 3500 ఎక్స్‌టెండెడ్ కాంపొనెంట్స్ వారంటీని అందిస్తోంది. వీటిని వర్తింపచేస్తే Rizta S ఇప్పుడు రూ. 1,04,758(ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. దాదాపుగా రూ. 10,000 తక్కువ. అదేవిధంగా, 450S ధర రూ. 1,13,100 (ఎక్స్-షోరూమ్ ముంబై), దాదాపు రూ. 17,899 తగ్గింపు.

ఏథర్ Rizta పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ స్కూటర్‌గా పేరు తెచ్చుంది. దీని విశాలమైన డిజైన్, పెద్ద 34-లీడర్ అండర్ సీట్ స్టోరేజ్, 123 కి.మీ IDC రేంజ్ కలిగి ఉంటుంది. ఇది 2.9 kWh బ్యాటరీ మరియు 80 kph గరిష్ట వేగం, Google Maps ఇంటిగ్రేషన్ మరియు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌ల వంటి Ather యొక్క సిగ్నేచర్ కనెక్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. మరోవైపు, ఫన్ రైడ్ కోరుకునే వారికి 450S బెస్ట్ ఛాయిస్. 15 కి.మీ పరిధి (IDC) వరకు 2.9 kWh బ్యాటరీని మరియు 6 kW మోటారు ఫాస్ట్ యాక్సిలిరేషన్ అందిస్తుంది.