NTV Telugu Site icon

2024 Kia Sonet facelift: న్యూ కియా సోనెట్.. లాంచ్, బుకింగ్, డెలివరీ వివరాలు మీ కోసం..

2024 Kia Sonet Facelift

2024 Kia Sonet Facelift

2024 Kia Sonet facelift: కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ ఈ నెలలో ఆవిష్కరించబడింది. గతంలోని సోనెట్‌తో పోలిస్తే ఇప్పుడు వస్తున్న ఫేస్‌లిఫ్ట్ పూర్తిగా టెక్ లోడెడ్ ఫీచర్ల, సేఫ్టీ ఫీచర్లతో వస్తోంది. ప్రస్తుతం మార్కె్ట్‌లో ఉన్న కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV300, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజ్జాలతో పోటీపడనుంది.

వచ్చే ఏడాది అంటే 2024 జనవరిలో ఈ కార్ ఇండియాలో లాంచ్ కాబోతోంది. ఇప్పటికే కియా సోనెట్ 2024 కోసం బుకింగ్స్ ప్రారంభయ్యాయి. కొత్త సోనెట్ డెలివరీలు జనవరి నుంచి ప్రారంభం అవుతాయి. అయితే డీజిల్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ డెలివరీలు మాత్రం ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానున్నాయి.

కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్స్:

2024 సోనెట్ నాలుగు ట్రిమ్‌‌లతో వస్తోంది. HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్. మొత్తం 19 వేరియంట్లతో లభ్యం కానుంది.

Read Also: Vivek Bindra Controversy: పేరుకు పెద్ద మోటివేషన్ స్పీకర్.. పెళ్లైన కొన్ని గంటలకే భార్యపై గృహ హింస

ఇంజిన్, టాన్స్‌మిషన్:

2024 సోనెట్ మూడు ఇంజన్ ఛాయిస్‌లను కలిగి ఉంది. Smartstream G1.2-లీటర్ పెట్రోల్ (83PS/115Nm), స్మార్ట్‌స్ట్రీమ్ G1.0-లీటర్ T-Gdi పెట్రోల్ (120PS/172Nm) మరియు 1.5-లీటర్ CRDi VGT డీజిల్ (116PS/250Nm) ఇంజన్లలో లభ్యమవుతుంది.

ట్రాన్స్‌మిషన్ విషయానికి వస్తే.. 1.2 పెట్రోల్‌తో 5-స్పీడ్ MT, 1.0 టర్బో పెట్రోల్‌తో 6-స్పీడ్ iMT మరియు 7-స్పీడ్ DCT, 1.5 డీజిల్‌తో 6-స్పీడ్ MT, 6-స్పీడ్ iMT , 6-స్పీడ్ AT ఆప్షన్లు ఉన్నాయి.

ఫీచర్లు:

2024 సోనెట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, LED సౌండ్-యాంబియంట్ లైటింగ్, 10.25-అంగుళాల HD టచ్‌స్క్రీన్ నావిగేషన్ మరియు 10.25-ఇంచుల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానెల్, సరౌండ్ వ్యూ మానిటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. మొత్తం 15 హై సేఫ్టీ ప్యాకేజ్, 10 ADAS ఫీచర్‌లతో సహా 25 సేఫ్టీ ఫీచర్లు, 70 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్లు కలిగి ఉంది.