NTV Telugu Site icon

Honda Dio Launch: కొత్త స్కూటర్‌ని విడుదల హోండా.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

Honda Dio

Honda Dio

Honda Launches Honda Dio in India: హోండా మోటార్‌ సైకిల్ మరియు స్కూటర్ ఇండియా సరికొత్త ‘డియో’ స్కూటర్‌ను (Honda Dio Launch 2023) విడుదల చేసింది. హోండా డియో స్కూటర్ ప్రారంభ ధర రూ. 70,211. నూతన హోండా డియో ఇప్పుడు 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ స్కూటర్‌ స్టాండర్డ్, డీలక్స్ మరియు స్మార్ట్ వేరియంట్‌లలో వస్తుంది. స్టాండర్డ్ ధర రూ. 70,211 ఉండగా.. డీలక్స్ ధర రూ. 74,212లుగా ఉంది. ఇక స్మార్ట్ స్కూటర్‌ ధర రూ. 77,712 లుగా ఉంది. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు అని గుర్తుచుకోవాలి.

Honda Dio Launch Smart Key:
2023 హోండా డియో ఇప్పుడు స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ స్టార్ట్ మరియు స్మార్ట్ సేఫ్ వంటి ఫీచర్లతో హోండా స్మార్ట్ కీ సిస్టమ్‌ను కలిగి ఉంది. స్మార్ట్ కీ కారణంగా ఇది యాంటీ-థెఫ్ట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా స్కూటర్ 2 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నా.. లాక్ వేసుకునే సదుపాయం ఉంటుంది. కొత్త డియో స్కూటర్‌లో BSVI OBD2తో 110cc PGM-FI ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 7.65bhp మరియు 9Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ పూర్తి డిజిటల్ మీటర్‌ను కలిగి ఉంటుంది. ఈ మీటర్ రేంజ్, సగటు మైలేజ్ మరియు రియల్ టైమ్ మైలేజ్ వంటి సమాచారాన్ని చూపిస్తుంది.

Honda Dio Launch Digital Meter:
మొత్తం ప్రయాణ సమయం మరియు సేవా సూచిక వంటి సమాచారం కూడా ఈ మీటర్‌లో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ డిజిటల్ మీటర్ హోండా డియో డీలక్స్ మరియు హోండా డియో స్మార్ట్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఇంజిన్ ఇన్హిబిటర్‌తో పాటు సైడ్ స్టాండ్ ఇండికేటర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇంజిన్‌ను స్టార్ట్ లేదా స్టాప్ స్విచ్‌తో మీరు ప్రారంభించవచ్చు.

Also Read: Apple iPhone 14 Price Drop: ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. ఇప్పుడే కొనేసుకుంటే బెటర్! లిమిటెడ్‌ పీరియడ్‌ ఆఫర్

Honda Dio Launch Features:
హోండా డియో స్కూటర్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ పాకెట్ మరియు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌తో పాసింగ్ స్విచ్ కలిగి ఉంటుంది. హోండా డియోలో 160mm గ్రౌండ్ క్లియరెన్స్, 18-లీటర్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ మరియు రెండు క్యాప్ ఫ్యూయల్ ఓపెనింగ్ సిస్టమ్ ఉన్నాయి. ఇది టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు ఈక్వలైజర్‌తో కూడిన కాంబి-బ్రేక్ సిస్టమ్ (CBS), 3-దశల సర్దుబాటు చేయగల వెనుక సస్పెన్షన్‌ను పొందుతుంది. ఇక హోండా కంపెనీ 10-సంవత్సరాల వారంటీ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో 3 సంవత్సరాల ప్రామాణిక మరియు 7 సంవత్సరాల ఐచ్ఛిక వారంటీ ఉంది.

Also Read: Venkatarami Reddy: కాంట్రాక్ట్ ఉద్యోగులకు సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చారు

Show comments