నిమ్స్ యూరాలజీ విభాగం రికార్డులను తిరగరాస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి సర్జరీలకు నమ్మకమైన చిరునామాగా నిలిచిన నిమ్స్, భారీ శస్త్రచికిత్సలు, ఆధునిక నైపుణ్యంతో ప్రసిద్ధి చెందింది. 2015లో సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. సి. రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్ల బృందం గత పదేళ్లలో 1000కి పైగా కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసింది. ముఖ్యంగా గత […]
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. ఒకే కుటుంబంలో 8మందికి ఫుడ్ పాయిజన్ అయ్యింది. ఎల్బీనగర్ చింతలకుంటలో ఘటన చోటుచేసుకుంది. ఓ కుటుంబం బోనాల పండుగ రోజు తెచ్చుకున్న మటన్ ను వండి ఫ్రిజ్లో పెట్టుకుంది. ఫ్రిజ్లో లో నిల్వ చేసిన మటన్ ని ఈ రోజు తిరిగి తినడంతో ఫుడ్ పాయిజన్ కు గురైనట్లు సమాచారం. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆర్టీసీ ఉద్యోగి శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగతా ఏడుగురు […]
తెలంగాణలో కులగణన సర్వేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సెక్రటేరియట్ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో సోషియో ఎకనామిక్, పొలిటికల్, క్యాస్ట్ సర్వే చేసిందన్నారు. సర్వే మొదలు పెట్టినప్పుడు అనేక సందేహాలు, అవసరం లేదని కొన్ని రాజకీయ పార్టీలు అన్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే చారిత్రాత్మక సర్వేగా దేశంలో నిలబడుతుంది.. పోస్ట్ క్యాస్ట్, ప్రీ క్యాస్ట్ సర్వే రిపోర్ట్ అసెంబ్లీలో పెట్టాం.. రాహుల్ […]
పండ్లు ఆరోగ్య గుళికలు. ప్రతి రోజు పండ్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. వాటిల్లో సూపర్ బెనిఫిట్స్ అందించే డ్రాగన్ ఫ్రూట్ క్యాన్సర్, డయాబెటిస్ రోగులకు ఓ వరం అని అంటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ అందించే ప్రయోజనాలు తెలిస్తే ధర గురించి ఆలోచించకుండా కొనేస్తారని చెబుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ దాని ప్రత్యేకమైన రంగు, రుచికి ప్రసిద్ధి చెందింది. తక్కువ కేలరీల పండు, ఇందులో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో […]
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి బోర్డు పరీక్షలో మంచి మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల 1200 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లను అందించాలని నిర్ణయించింది. ఒలింపిక్స్, ఆసియాడ్, కామన్వెల్త్ క్రీడల వంటి అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు, అథ్లెట్లకు బహుమతి డబ్బును పెంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు ఒలింపిక్ క్రీడల విజేతలకు 3 కోట్లు, 2 కోట్లు, 1 కోటి రూపాయలు ఇచ్చేవారు. Also Read:Pawankalyan : వెయ్యి కేజీల […]
పరాయి వ్యక్తులపై మోజు, అక్రమ సంబంధాలు భార్యాభర్తల బంధానికి బీటలుపారేలా చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ప్రియుడి సాయంతో భర్తలను చంపేస్తున్నారు కొందరు భార్యలు. కొన్ని రోజుల క్రితం ఓ భార్య తన భర్తను సెల్ఫీ తీసుకుందామని చెప్పి నదిలోకి తోసేసిన విషయం తెలిసిందే. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద ఓ భయానక ఘటన జరిగింది. సెల్ఫీ దిగుదామని పిలిచి, భర్తను నదిలో తోసిన సంఘటన రాయచూరు జిల్లాలో కలకలం రేపింది. అయితే ఈ కేసులో బిగ్ […]
పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. ఉగ్రమూకల చర్యతో యావత్ భారత్ పాక్ కు తగిన బుద్ధి చెప్పాలని నినదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి కోలుకోలేని దెబ్బతీసింది. ఇదిలా ఉంటే.. ఓ పదేళ్ల బాలుడు ఆపరేషన్ సింధూర్ హీరో అయ్యాడు. శ్రవణ్ సింగ్ అనే బాలుడికి భారత ఆర్మీ బంపరాఫర్ ఇచ్చింది. తారావాలి గ్రామంలో నివసించే శ్రవణ్, ఆపరేషన్ […]
ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే వాటికోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. జెలియో కంపెనీ చౌక ధరలోనే అద్భుతమైన ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. జెలియో మొబిలిటీ జెలియో గ్రేసీ+ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో, జెలియో భారత మార్కెట్లో గ్రేసీ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. ఈ స్కూటర్ను ఆరు వేరియంట్ల ఆప్షన్ తో తీసుకొచ్చారు. Also […]
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని సంబంధిత అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వచ్చే ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు కావాలి అని ఆదేశించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళ లకు జీరో ఫేర్ టికెట్లు ఇవ్వాలి.. టికెట్ పై […]
పల్నాడు జిల్లా శావల్యపురం మండలం కనుమర్లపూడి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అశోక్ లే ల్యాండ్ వ్యాన్, ఆటోఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న రూరల్ సిఐ ప్రభాకర్ రావు పరిస్థితిని సమీక్షించారు. మృతులంతా శావల్యాపురం మండలం కారుమంచి వాసులుగా గుర్తించారు. మృతులు బత్తుల బ్రహ్మయ్య, నాగమూర్తమ్మ, […]