Gogikar Sai Krishna
Author- NTV Telugu-
బస్సును ఢీ కొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు..
శంషాబాద్ నుంచి బెంగళూరు వైపుకు వెళ్లె జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్‌కు చెందిన డాక్టర్ మరో ఇద్దరితో కలిసి జాతీయ రహదారిపై కారులో ప్రయాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందు వెళుతున్న బస్సు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు వెనకాల నుంచి కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందడంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రంగారెడ్డి […] -
కేసీఆర్‌కు అసలు సోయి కూడా లేదు : డీకే అరుణ
సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దీపావళి పండుగ పురస్కరించుకొని దేశ ప్రజలకు బహుమతిగా పెట్రోల్ డీజిల్ ధరల పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని డీకే అరుణ అన్నారు. Also Read : హైదరాబాద్ కు ఈటల.. సిద్ధిపేటలో ఆగి ఏం చేశారంటే.. కేంద్ర ప్రభుత్వం […] -
ఏపీలో కొత్తగా మరో 301 కరోనా కేసులు.. మరణాలు ఎన్నంటే..?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరి తన ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో కరానోనా తగ్గుముఖం పడుతోంది. తాజాగా రాష్ట్రంలో 36,373 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 301 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారనైంది. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో ఇద్దరు కరోనా బారినపడి మృతి చెందగా.. 367 మంది కరోనా నుంచి కొలుకున్నారు. ప్రస్తుతం రాష్రంలో 3,830 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. -
బీహార్‌లో కలకలం రేపుతున్న కల్తీ మద్యం
బీహార్ రాష్ట్రంలో కల్తీ మద్యం కలకలం రేపుతోంది.కల్తీ మద్యం తాగి 9 మంది మృతి చెందిన విషాద సంఘటన బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని గోపాల్‌గంజ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ కొందరు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందారు. మరి కొందరు ఇంట్లోనే మరణించారు. ఇలా 9 మంది మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. […] -
జీవీఎంసీలో ఉప ఎన్నిక.. కీలక నిర్ణయం తీసుకున్న వైసీపీ
గ్రేటర్ విశాఖపట్నం మున్సిప్ కార్పోరేషన్ పరిధిలో 31వ వార్డు కార్పొరేటర్ పదవికి ఉప ఎన్నిక జరుగనున్న నేపథ్యం అధికార వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ మరణించడంతో ఈ ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే వానపల్లి రవికుమార్ సతీమణి గాయత్రిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తే పోటీ చేయకూడదని వైసీపీ నిర్ణయం. అనితర ప్రజా సేవ చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే పోటీ చేయకూడదన్న రాజకీయ విలువలకు పార్టీ […] -
వాలంటీర్ ఆత్మహత్య.. కారణం అదేనా..?
ఓ వార్డు వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వార్డు వాలంటీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రవి కుమార్ అనే వ్యక్తి తాడేపల్లిలో నిన్నటి నుంచి కనిపించడం లేదు. అయితే రవికుమార్ ఈ రోజు నదిలో శవమై కనిపించాడు. దీంతో రవికుమార్ శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేయడంతో అతడు వాలంటీర్ రవికుమార్‌గా గుర్తించారు. అంతేకాకుండా అతడి వద్ద సూసైడ్ నోట్ కూడా లభ్యమైనట్లు పోలీసులు […] -
విజయవంతంగా మరో మిస్సైల్‌ను ప్రయోగించిన డీఆర్డీవో
భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీవో) దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ యాంటీ ఎయిర్‌ఫీల్డ్ వెపన్ ను ఇండియాన్ ఎయిర్‌ఫోర్స్‌తో కలిసి విజయవంతంగా పరీక్షించాయి. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల బంకర్లు, రాడార్లతో పాటు రన్వేలు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లను, రీన్ ఫోర్స్ నిర్మాణాలను ఈ మిస్సైల్ ధ్వంసం చేస్తుంది. దీనిలో ఉన్న ఎలక్ట్రో ఆప్టికల్, శాటిలైట్ నావిగేషన్ సెన్సార్ల ఆధారంగా రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లను విజయవంగా పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. శాస్త్రవేత్తలు ఐఐఆర్ (ఇమేజింగ్ […] -
ఈటలపై కేసు నమోదు..
భారత ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు తరువాత ఏ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలు తీయడానికి వీళ్లేదని ఎన్నికల అధికారులు నిబంధనలు జారీ చేశారు. అయితే నిన్న ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తరువాత బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుంచి కోర్టు చౌరస్తా వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారని తెలుపుతూ ఈటల రాజేందర్‌తో పాటు […] -
హాట్ న్యూస్ : టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్
ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో సులక్షణ నాయక్, మిస్టర్ ఆర్పి సింగ్‌లతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ బుధవారం రాహుల్ ద్రవిడ్‌ను టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా ఏకగ్రీవంగా నియమించింది. న్యూజిలాండ్‌తో జరగనున్న సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. రవిశాస్త్రి (మాజీ టీమ్ డైరెక్టర్ & హెడ్ కోచ్), బి. అరుణ్ (బౌలింగ్ కోచ్), ఆర్. శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్), విక్రమ్ […] -
ఫ్లాష్.. ఫ్లాష్ : పెట్రోల్ ధరలు తగ్గించిన కేంద్రం…
రోజురోజు పెట్రోల్ ధరలు ఆకాశానంటుతున్నాయంటూ వాహనదారులు ప్రభుత్వాలపై మండిపడుతున్న వేళ.. కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. లీటర్ పెట్రోల్ ధరపై రూ.5, లీటర్ డిజీల్ ధరపై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమలులో ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
-
Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..
-
CM Chandrababu : కృష్ణానది పడవ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం.. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
-
Nag Ashwin: ‘మాయాబజార్’ సెట్స్ చూసిన మహానుభావుడితో సినిమా.. ఎమోషనల్ అయిన స్టార్ ప్రొడ్యూసర్!
-
TMC Crisis: బెంగాల్ రాజకీయాల్లో సంచలనం.. ‘‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ’’లో టీఎంసీ ఎంపీలు విలీనం..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నాన్-స్టిక్ అవసరమే లేదు.. ఈ ట్రిక్‌తో స్టీల్ పాత్రలే సూపర్.!
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!