అమ్మాయి పెళ్లికి ఏది సరైన వయసు? నలబై ఏళ్ల క్రితం ఆడ పిల్ల వివాహ వయస్సు పదిహేనేళ్లు. తరువాత దానిని పద్దెనిమిదికి పెంచారు. ఇక ముందు మగపిల్లలతో సమానంగా ఆడపిల్ల పెళ్లి వయస్సు కూడా 21 ఏళ్లుగా సర్కార్ చట్ట సవరణ చేయనుంది. జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ సిఫార్సులను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఇక పార్లమెంట్ ఆమోదం పొందటమే తరువాయి. అంటే ఇకపై మన దేశంలో టీనేజ్ వివాహాలకు ఛాన్స్ లేదు. బాల్య […]
సబ్జెక్ట్ లేని సీఎం మూడు రాజధానులు అంటూ కాలక్షేపం చేస్తుంటే కంపెనీలన్నీ ఇతర రాష్ట్రాలకు క్యూ కడుతున్నాయి. టీడీపీ హయాంలో ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్ గా మారిన విశాఖ ఇప్పుడు వెలవెలబోతోంది అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. 15 ఏళ్ళ నుంచి ఉత్తరాంధ్ర యువతకి వేలాదిగా ఉద్యోగ అవకాశాలు కల్పించిన హెచ్‌ఎస్‌బిసి మూతపడటం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వం నియంత నిర్ణయాలు, బెదిరింపులకు భయపడి ఇప్పటికే అనేక కంపెనీలు సైలెంట్ గా ఇతర […]
ప్రస్తుతం భారత క్రికెట్ లో ఒక అలజడి ఉన్న విషయం తెలిసిందే. నిన్న విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. కోహ్లీ వ్యాఖ్యలతో ఆయనకు, బీసీసీఐకి మధ్య గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటానంటే తాను వద్దని చెప్పినట్టు ఇటీవల గంగూలీ తెలిపాడు. అయితే బీసీసీఐ అలా చెప్పలేదని కోహ్లీ స్పష్టం చేశాడు. సౌతాఫ్రికాతో టెస్ట్ టీమ్ సెలక్షన్‌కు గంటన్నర ముందు మాత్రమే బీసీసీఐ తనను కాంటాక్ట్ చేసిందన్నారు కోహ్లీ. టీ20 […]
కర్నూలులో రాయలసీమ ఆత్మగౌరవ సభ నిర్వహించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి, యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. అయితే ఈ సభలో… అమరావతి రైతులకు మద్దతు తెలిపిన రాయలసీమ నేతల ఇళ్లకు గాజులు, చీరలు పంపుతాం అని జేఏసీ పేర్కొంది. రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేయకుంటే ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తాం. అలాగే మూడు రాజధానుల బిల్లు తిరిగి ప్రవేశపెట్టకుంటే సీఎం జగన్ ఇల్లు కూడా ముట్టడిస్తాం అని జేఏసీ హెచ్చరించింది. […]
పవన్ కల్యాణ్ చేస్తున్న కామెంట్స్ టీడీపీని కలవర పెడుతున్నాయా? ఈ మధ్య కాలంలో టీడీపీని జనసేనాని ఎక్కడా విమర్శించకపోయినా.. ఆందోళన ఎందుకు? పవన్ చూపిస్తున్న సింపతీపై తమ్ముళ్ల లెక్కలేంటి? లెట్స్ వాచ్..! టీడీపీని జనసేనాని తిట్టకపోయినా.. తమ్ముళ్లలో టెన్షన్..! కొంతకాలంగా జనసేనాని పవన్‌కల్యాణ్ సీఎం జగన్ మీద.. YCP ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారు. ఈ విమర్శలకు అధికారపార్టీ నుంచి గట్టి కౌంటర్లే పడుతున్నాయి. అలాగే పవన్ ఏపీకి వచ్చిన ప్రతిసారీ ఇక్కడి రాజకీయం కాస్తో కూస్తో వేడెక్కుతూనే ఉంది. […]
ప్రపంచంలో అత్యంత ఆరాధించబడే టాప్-20 పురుషుల జాబితాలో విరాట్ కోహ్లి చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లి 18వ స్థానంలో నిలిచాడు. అయితే కోహ్లీ కంటే ముందు భారత ప్రధాని నరేంద్ర మోడీ, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఈ జాబితాలో మోడీ 8వ స్థానంలో నిలవగా… ఎప్పుడో క్రికెట్ ను వదిలేసిన సచిన్ 12 వ స్థానంలో ఉన్నాడు. అలాగే షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ […]
ఆటగాళ్లు ఆటపై దృష్టిపెట్టాలి.. బీసీసీఐ టీమ్ మేనేజ్ మెంట్, టూర్‌లు, బిజినెస్ సంగతి చూడాలి. ఇక్కడ ఆ డివిజన్‌లో క్లారిటీ మిస్సయింది. ఇగోలు, పవర్ గేమ్ లు మొదలయ్యాయి. ఆటగాళ్లను కంట్రోల్ చేయాల్సిన బీసీసీఐ కంట్రోల్ తప్పుతోందా? లేని వివాదాలు సృష్టిస్తూ ప్లేయర్ల మధ్య గ్యాప్ పెంచుతోందా? భారత్ క్రికెట్ జట్టులో జరుగుతున్న పరిణామాలు… దేశ పరువును పొగొట్టేలా ఉన్నాయి. ప్లేయర్ల మధ్య భేదాభిప్రాయాలు వస్తే సరిదిద్దాల్సిన కెప్టెన్లే… ఇప్పుడు గొడవపడుతున్నారు. టీం ఇండియా కెప్టెన్లు రోహిత్ […]
నరసరావుపేట పార్లమెంట్‌పై ఈ మధ్య ఓ నేతకు కొత్త ప్రేమ పుట్టుకొచ్చింది. పార్టీలు పక్కనపెట్టి ప్రజాసేవ చేద్దాం రండి అంటూ ఎమ్మెల్యేలను, స్థానికులు కలుపుకొని హల్‌చల్ చేస్తున్నారు. ఉంటే ఢిల్లీలో.. లేదంటే నరసరావుపేటలో.. ఇదే నా టార్గెట్..! నేను మీ వాడినే అంటూ ఊరూరు తిరుగుతున్నారట. ఇంతకీ ఢిల్లీ నుంచి నరసరావుపేటపై ప్రేమ కురిపిస్తున్న నేత ఎవరు? జీవీఎల్ ముందస్తుగా ఇల్లు సర్దుకుంటున్నారా? GVL నరసింహారావు. ఏపీ రాజకీయాలకు ముఖ్యంగా బీజేపీకి పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం […]
అంత కాదు.. ఇంతన్నారు. పెద్ద సంఘాలన్నీ యుగళగీతం పాడాయి. మూడు రోజులు సమ్మెలో ఐక్యత చాటాయి. మరి.. వారి పోరాటం ఫలించిందా? లేక వాళ్లదంతా ఆరాటమేనా? సమ్మె లక్ష్యం ఏమైంది? కార్మికుల్లో పల్చన కాకూడదనే సంఘాలు సమ్మెకు వెళ్లాయా? కలిసి వస్తే సరే.. లేదంటే ద్రోహులే..! సింగరేణిలో మూడు రోజుల సమ్మెకు ముందు జరిగిన ప్రచారం. సింగరేణిలో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికలోకం ఉద్యమించింది. ఉద్దేశం ఎలా ఉన్నా.. గుర్తింపు సంఘం చేసిన హడావిడి.. అనుసరించిన […]
ఇండియన్ క్రికెటర్లు అడ్డం తిరుగుతున్నారు. రోహిత్-విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు మరింత ముదిరిపోయాయ్. వన్డే సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యానంటున్నాడు కోహ్లీ. అనారోగ్యంతో టెస్టులకు దూరమయ్యాడు రోహిత్. ఐతే…కెప్టెన్సీ కోల్పోవటంతో కోహ్లీ మనస్తాపం చెందాడు. ఫలితంగా టీమిండియా ఆటగాళ్లలో వివాదాలు ముదిరిపోయాయ్. మరోవైపు…కోహ్లీని దారిలో పెట్టే పనిలో పడింది బీసీసీఐ. కోహ్లీ వ్యవహార శైలి ధిక్కారమే అంటున్నాయ్ బీసీసీఐ వర్గాలు. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉంది బీసీసీఐ. దక్షిణాఫ్రికా టూర్ మొదలైనప్పటి నుంచి ఆ […]