Site icon NTV Telugu

YV Subbareddy: జూన్ 18 నుంచి జూలై 9 వరకూ అమెరికాలో కళ్యాణోత్సవం

Ttd Yv

Ttd Yv

అమెరికాలోని శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమెరికాలో వున్న తెలుగు వారి కోసం ఈ నెల 18 వ తేదీ నుంచి జూలై 9తేది వరకు కళ్యాణోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 7 నగరాలలో కళ్యాణోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

నాటా ఆధ్వర్యంలో కళ్యాణోత్సవ కార్యక్రమాలకు భక్తులను ఉచితంగా అనుమతిస్తాం అనీ, భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని భావిస్తున్నామన్నారు. కళ్యాణోత్సవ కార్యక్రమాలకు విగ్రహాలను తిరుమల నుంచి తీసుకువెళ్లి..తిరుమల తరహలోనే కళ్యాణోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని సుబ్బారెడ్డి తెలిపారు. త్వరలోనే యూకే,దుబాయ్ వంటి దేశాలలో కూడా కళ్యాణోత్సవ కార్యక్రమాలను నిర్వహించేందుకు యోచిస్తున్నామన్నారు. ఇటీవల ఢిల్లీలో టీటీడీ కళ్యాణోత్సవాలు నిర్వహించగా, రాజకీయ ప్రముఖులతో పాటు ఆధ్యాత్మిక వేత్తలు, సాధారణ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

టీటీడీ ఉద్యోగులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వేసవి రద్దీ తగ్గిన తరువాత సర్వదర్శన భక్తులకు టోకెన్లు జారీచేస్తామన్నారు. రేపటి నుంచి శ్రీవారి వార్షిక జ్యేష్టాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. రేపు వజ్రకవచం ధరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. ఎల్లుండి ముత్యపు కవచంలో, చివరి రోజున స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మలయప్పస్వామి. ఇవాళ తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్టాభిషేకం టిక్కెట్లు విడుదల చెయ్యనుంది టీటీడీ. వేసవి సెలవులు చివరి దశకు చేరడంతో భక్తుల రద్దీ విపరీతంగా వుంది. దర్శనానికి గంటల తరబడి వేచి వుండాల్సి వస్తోంది.

RK Roja: టీడీపీవి దిగజారుడు రాజకీయాలు

Exit mobile version