Site icon NTV Telugu

YV Subbareddy: వాలంటీర్లను తప్పు పడితే.. ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవ్

Yv Subbareddy

Yv Subbareddy

YV Subbareddy Fires On Pawan Kalyan Over Volunteers Issue: ఏపీ వాలంటీర్లపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. హ్యూమన్ ట్రాఫికింగ్‌లో వాలంటీర్ల హస్తం కూడా ఉందన్నట్టుగా ఆయన తన వారాహి యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడంతో.. వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజాసేవ చేసే తమపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదంటూ పవన్‌కి వ్యతిరేకంగా రోడ్డెక్కారు. ఆయన దిష్టిబొమ్మల్ని సైతం దగ్ధం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు సైతం పవన్ వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. ఏపీలో జగన్‌కి పెరుగుతున్న ప్రజాదరణను చూసి తట్టుకోలేకే పవన్ ఇలాంటి దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నాడంటూ మండిపడ్డారు.

Tomato Effects: టొమాటో తింటే వీరికి ప్రమాదం.. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది..!

ఇప్పుడు తాజాగా విశాఖ వైసీపీ ఇంచార్జ్ వైవీ సుబ్బారెడ్డి పవన్ వ్యాఖ్యలపై తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. వాలంటీర్లపై అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారని తూర్పారపట్టారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే.. ముఖ్యమంత్రి జగన్‌, వాలంటీర్లపై పవన్ విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీలో వాలంటీర్‌ వ్యవస్థను దేశం మొత్తం ప్రశంసిస్తోందని, నీతి ఆయోగ్‌ సమావేశంలో వాలంటీర్లను అభినందించారని గుర్తు చేశారు. వాలంటీర్ వ్యవస్థను ప్రధాని మోడీ సైతం కొనియాడారని పేర్కొన్నారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వాలంటీర్లు పని చేస్తున్నారని.. జన్మభూమి కమిట్లీలా వాలంటీర్ల వ్యవస్థ దోపిడీలకు పాల్పడలేదని కౌంటర్ ఇచ్చారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వాలంటీర్లు ప్రజలకు సేవ చేశారు. అలాంటి వాలంటీర్లపై పవన్ ఆరోపణలు చేయడం దారుణమని అన్నారు. వాలంటీర్లను తప్పుపడితే.. ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. వాలంటీర్లతో పాటు ఏ అంశంపై అయినా ప్రతిపక్షాల ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధమని ఛాలెంజ్ చేశారు.

Kottu Satyanarayana: సీఎం జగన్‌ని విమర్శిస్తే.. ప్రజలే పవన్‌కి మరోసారి బుద్ధి చెప్తారు

ఇదే సమయంలో.. త్వరలోనే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం విశాఖపట్నంకు వస్తుందని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వీలైతే ఆగస్టు, లేదంటే సెప్టెంబర్‌లో వస్తారని తెలిపారు. న్యాయపరమైన అడ్డంకుల వల్లే ముఖ్యమంత్రి విశాఖ రావడం కాస్త ఆలస్యం అయిందన్నారు.

Exit mobile version