YV Subbareddy : ఆర్జిత సేవల ధరలు పెంపుపై క్లారిటీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్య భక్తులకు సర్వదర్సనం ప్రారంభించి పదిరోజులవుతోందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రెండు సంవత్సరాల తరువాత సర్వదర్శనాన్ని ప్రారంభించామని, సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని, భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదని ఆయన వెల్లడించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని, ఉత్తర భారతదేశం నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామని పేర్కొన్నారు. భోజనంతో పాటు మూడుపూటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామని, తిరుమలలోని మరో రెండు ప్రాంతాల్లో అన్నప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
అయితే ఇటీవల పాలకమండలి ఆర్జిత సేవల టికెట్ ధరల పెంపుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అయితే దీనిపై ఆయన స్పందిస్తూ.. ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు సమయం పడుతుందని, త్వరలోనే ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామని, ఏ సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని ఆయన స్పష్ట చేశారు. ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన ఇప్పట్లో లేదని, ధరల పెంపుపై కేవలం చర్చ మాత్రమే పాలకమండలిలో జరిగిందన్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే టీటీడీ పాలకమండలి ముఖ్య ఉద్దేశమన్నారు. వీఐపీ దర్శనాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
-
Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
-
Vishwanath and Sons: రూ.200 కోట్ల క్లబ్‌లోకి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. బాక్సాఫీస్ దగ్గర సూర్య మూవీ మాస్ ర్యాంపేజ్!
-
Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
-
Prabhas: డార్లింగ్ సినిమాల్లో అసలు జరుగుతున్నదేంటి? ‘కన్నప్ప’తో మొదలైన బాడీ డబుల్ రచ్చ.. ‘స్పిరిట్’పై క్లారిటీ!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!