NTV Telugu Site icon

YV Subba Reddy: జగన్ బీసీల పక్షపాతి.. ఆ ఘనత ఒక్క ఏపీ ప్రభుత్వానిదే

Yv Subba Reddy

Yv Subba Reddy

YV Subbareddy Speech In Vizag BC Garjana Sabha: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి బీసీల పక్షపాతి అని.. పదవులు, ప్రాతినిధ్యం ఇవ్వడంలో ఆయన చూపించే చొరవ అందుకు నిదర్శనమని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. విశాఖలో ఆదివారం నిర్వహించిన బీసీ గర్జన సభలో ఆయన మాట్లాడుతూ.. బీసీల గొంతు చట్టసభల్లో వినిపించేందుకు ఆర్.కృష్ణయ్యను జగన్ రాజ్యసభకు పంపించారని చెప్పారు. పార్టీ ఆవిర్భావం మొదట్లోనే ఆర్.కృష్ణయ్యకు రాజకీయ అవకాశం కల్పించాలని జగన్ భావించారన్నారు. ఏపీలో బీసీలకు దక్కుతున్న ప్రాధాన్యతను ఇతర రాష్ట్రాలు గమనిస్తున్నాయన్నారు. బీసీ ముఖ్యమంత్రులు పాలిత రాష్ట్రాల్లో దక్కని అవకాశాలను ఇక్కడ జగన్ కల్పిస్తున్నారని తెలిపారు. ‘బీసీలు వెనుకబడిన వాళ్ళు కాదు, వెన్నెముక’ అన్న మాటకు కట్టుబడి.. వారి సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని ఉద్ఘాటించారు.

Muraleedharan: ఏపీ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారు

ఇదే సభకు హాజరైన మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ.. బీసీల సమగ్ర సర్వే కోసం ఐదుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీ వేసిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని స్పష్టం చేశారు. బీసీలకు పెదరికమే సుదీర్ఘ రోగమని.. రెండు, మూడు తరాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వృత్తుల ద్వారా వచ్చే ఆదాయం పొట్ట నింపుకోవడానికే సరిపోయిందన్నారు. అలాంటి పేదరికానికి వైద్య చేసిన మహా నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. కానీ.. చంద్రబాబు మాత్రం బీసీలకు ఇంజనీరింగ్ విద్యకు దూరం చేసిన దుర్మార్గుడు అని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అలా కాదని.. బీసీల అవసరాలను గుర్తించి, వారికి పథకాలను అందచేస్తోందని అన్నారు. జగన్ ప్రభుత్వం బీసీలకు చేసిన మేలుపై విస్త్రతంగా చర్చ జరగాలని పిలుపునిచ్చారు.

Venugopala Krishna: అక్కడ వైసీపీలో అసమ్మతి లేదు.. మంత్రి వేణుగోపాల్ క్లారిటీ