ఏలూరు కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 50 డివిజన్లలో 46 చోట్ల వైసీపీ విజయం సాధించిగా, మూడు చోట్ల టీడీపీ విజయం సొంతం చేసుకుంది. అత్యధిక డివిజన్లు సొంతం చేసుకుంటామని వైసీపీ నేతలు ముందునుంచే చెప్తూ వస్తున్నారు. చెప్పిన విధంగానే వైసీపీ 46 చోట్ల విజయం సాధించడం విశేషం. గెలుపొందిన 46 డివిజన్లలో మూడు ఏకగ్రీవాలు ఉన్నాయి. ఇకపోతే, ఏలూరులో వీలైనన్ని స్థానాలు గెలుపొంది పట్టును నిరూపించుకోవాలని చూసిన టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. కేవలం మూడు స్థానాల్లో మాత్రమే టీడీపి విజయం సొంతం చేసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అన్ని కార్పోరేషన్లలో విజయబావుటా ఎగరవేసిన వైసీపీ ఏలూరు కార్పోరేషన్‌లో కూడా విజయం సాధించడంతో అన్ని కార్పోరేషన్లు వైసీపీ సొంతం అయ్యాయి. ముఖ్యమంత్రి చేపడుతున్న మంచి కార్యక్రమాలు, ప్రజాయోగ్యమైన సంక్షేమ పథకాలే విజయాలు సాధించేలా చేస్తున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.
Read: ‘రకరకాల భార్యలు’ పేరిట ఆర్జీవీ వెబ్ సిరీస్