YSRCP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టుపై ఫిర్యాదు చేసేందుకు మంగళగిరిలోని ఏపీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను వైసీపీ బృందం కలవడానికి వెళ్లింది. అయితే, డీజీపీ అందుబాటులో లేరని.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రత్యేక సమావేశానికి వెళ్లారని కార్యాలయ సిబ్బంది పేర్కొనింది. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళినా కనీసం ఏ అధికారి మా రెప్రజెంటేషన్ ను కూడా తీసుకోవడం లేదని వైసీపీ బృందం ఆరోపించింది. ఇక, ఏపీ డీజీపీని కలిసేందుకు వెళ్లిన వారిలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ తదితరులు ఉన్నారు.
Read Also: Lavanya: మస్తాన్ సాయి నాపై అత్యాచారం చేశాడు.. ఎంతో మంది యువతులను చెరబట్టాడు..
అయితే, ఈ రోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆయనను విచారణ చేస్తున్నారు. వంశీని అరెస్ట్ చేయడంతో వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేశారంటూ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు.