Site icon NTV Telugu

VijayaSaiReddy: విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్.. పోయిందా? పడేశారా?

Vijayasai Reddy

Vijayasai Reddy

VijayaSaiReddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత ఫోన్ పోయిందంటూ ఆయన వ్యక్తిగత కార్యదర్శి లోకేశ్వరరావు తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఉదయం ఫిర్యాదు చేశారు. ఈనెల 21న ఫోన్ పోయిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విజయసాయిరెడ్డి ఫోన్ ఎక్కడ ఉందో పోలీసులు వెదుకుతున్నారు. విజయసాయిరెడ్డి లెటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ వాడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ ఆయన్ను వందలాది మంది కార్యకర్తలు కలుస్తుంటారు. మరోవైపు పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయసాయిరెడ్డి ఎక్కువగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఆయన ఫోన్ మిస్ అయి ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

Read Also: Tomota Prices: అక్కడ రూపాయి.. ఇక్కడ రూ.20.. మధ్యలో లాభం ఎవరికి?

అయితే విజయసాయిరెడ్డి ఫోన్ పోలేదని.. కావాలనే ఆయన ఫోన్ మిస్ అయినట్లు నటిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని పోలీసులు విచారిస్తున్న సమయంలో ఇలా జరగడం వెనుక పెద్ద కథే ఉందని వివరిస్తున్నారు. ఈ మేరకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంతో తాడేపల్లి ప్యాలెస్ పూసాలు కదులుతున్నాయని.. అందుకే విజయసాయిరెడ్డి తన ఫోన్ పడేసుకున్నారని ఆరోపించారు. ఫోన్‌ను దాచుకుని తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అటు ఢిల్లీ లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డికి నోటీసులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ఈ మిస్సింగ్ ఫిర్యాదును ఉపయోగించి ఆయన ఫోన్ తనిఖీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

Exit mobile version