NTV Telugu Site icon

Vijaya Sai Reddy: చంద్రబాబు ఏం చేసినా డ్రామానే.. బాబు, లోకేష్‌కు నిజంగా ఇదే ఆఖరి ఎన్నిక..!

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

చంద్రబాబు, లోకేష్‌ఖు నిజంగా ఇదే ఆఖరి ఎన్నిక అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన… చంద్రబాబు ఏం చేసినా డ్రామానే అంటూ మండిపడ్డారు.. అసలు తన 14 ఏళ్ల పాలనా కాలంలో బీసీలకు చంద్రబాబు ఏం చేశాడు? అని నిలదీశారు.. ప్రస్తుతం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కేబినెట్‌లో 11 మంది మంత్రివర్గ సభ్యులు బీసీలే ఉన్నారు.. కానీ, చంద్రబాబు సమయంలో అలాంటి పరిస్థితి లేదన్నాఉ.. తన సొంత కులానికే చంద్రబాబు ప్రయోజనం కలిగిస్తాడు అని ఆరోపించారు.. సీఎం వైఎస్‌ జగన్‌కు బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్‌గా అభివర్ణించారు సాయిరెడ్డి.

Read Also: Thammineni Seetharam: పొరపాటు చేస్తే చరిత్ర క్షమించదు.. జగన్‌కు పట్టాభిషేకం చేయాల్సిన బాధ్యత మనదే..!

ఇక, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏ బాధ్యతలు అప్పగించినా చిత్తశుద్ధితో పని చేయటమే నా విధి అని స్పష్టం చేశారు సాయిరెడ్డి.. ఉత్తరాంధ్రలో బండారు, అయ్యన్న పాత్రుడు లాంటి టీడీపీ నాయకులు చేసిన అక్రమాలను నేను నిరూపిస్తాను అంటూ సవాల్‌ చేశారు.. ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు ఆక్రమించుకుంటే నేనే విడిపించి ప్రభుత్వానికి అప్పగించానన్న ఆయన… టీడీపీకి బీసీలు దూరం అవుతున్నారని, వైసీపీకి దగ్గర అవుతున్నారని చంద్రబాబుకు అర్ధం అయ్యిందని.. ఫ్రస్టేషన్ లో తెలుగుదేశం పార్టీ నేతలు ధర్నాలు, విధ్వంసాలకు పాల్పడే అవకాశం కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.. ఇక, చంద్రబాబు, లోకేష్ కు నిజంగానే ఇవి ఆఖరి ఎన్నిక కాబోతోంది అంటూ జోస్యం చెప్పారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో.. మరోఛాన్స్‌ అంటూ అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. ఒక్కఛాన్స్‌ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. ఆఖరి ఛాన్స్‌ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌ అయిన విషయం విదితమే.