NTV Telugu Site icon

MP Suresh: పవన్ కన్నా కేఏ పాల్ మేధస్సే ఎక్కువ..!

Nandigam Suresh

Nandigam Suresh

ప్రతిపక్షాల ఆరోపణలకు తనదైన శైలిలో జవాబులిచ్చే ఎంపీ నందిగం సురేష్.. తాజాగా మరోసారి కౌంటర్ల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్‌కు, కేఏ పాల్‌కు పెద్ద తేడా ఏమీ లేదని చెప్పిన ఆయన.. పవన్ కన్నా కేఏ పాల్ మేధస్సే ఎక్కువగా ఉంటుందని కుండబద్దలు కొట్టారు. చంద్రబాబు, ఆయన పార్టీ టీడీపీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే పవన్ బయటకు వస్తారని, అంతే తప్ప ప్రజలు ఏమైనా ఆయనకు పని లేదని వ్యాఖ్యానించారు.

Read Also: Yadadri: భక్తులకు ఊరట.. యాదాద్రిలో పార్కింగ్ ఫీజు నిబంధనల్లో మార్పులు

జగనన్న పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అది చూసి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఓర్చుకోలేక పోతున్నారని ఆరోపించారు. ప్రతీ పేదవాడు ఉన్నతంగా ఎదగాలని జగన్ పాటు పడుతుంటే, చంద్రబాబు మాత్రం తన బినామీలు బాగుంటే చాలనుకుంటాడని విమర్శించారు. ఇక లోకేష్ పిల్ల చేష్టలు చేస్తూ, రాజకీయాలు చేస్తున్నాడని ఎంపీ సురేశ్ ఎద్దేవా చేశారు.

Show comments