NTV Telugu Site icon

YSRCP Plenary 2022: 2024 టార్గెట్‌గానే వైసీపీ ప్లీనరీ

Mithun Reddy

Mithun Reddy

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీకి సర్వం సిద్ధమైంది.. రేపటి నుంచి రెండు రోజుల పాటు వైసీపీ ప్లీనరీ జరగబోతోంది.. ఈనెల 8, 9వ తేదీల్లో గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న స్థలంలో వైసీపీ ప్లీనరీ నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ మేరకు వైసీపీ ప్లీనరీ అజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఈనెల 8న ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్లీనరీ వేదికగా పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్ దిశానిర్దేశం ఉంటుందన్నారు.. 2024 టార్గెట్‌గానే ఈ ప్లీనరీ ఉంటుందని తెలిపారు. గత ప్లీనరీ ఇక్కడే చేపట్టాం… అధికారంలోకి వచ్చామని, సెంటిమెంట్ మళ్లీ వర్కౌట్‌ అవుతుంది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు మిథున్‌రెడ్డి..

Read Also: Nuclear War: అణు యుద్ధం జరిగితే భూమిపై “ఐస్ ఏజ్”.. తాజా అధ్యయనంలో వెల్లడి

ఇక, చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు అంటూ టీడీపీ అధినేతపై సెటైర్లు వేశారు ఎంపీ మిథున్‌రెడ్డి.. ఇంటికి ఒకరు రావాలని చంద్రబాబు ఆశిస్తున్నారు.. కానీ, ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్న ఆయన.. చంద్రబాబు భయపెడితే భయపడే పరిస్థితి లేదన్నారు.. ప్రజలు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి భ్రమరథం పడుతున్నారని తెలిపారు.. అయితే, ప్రభుత్వంపై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తున్న చంద్రబాబుకు సవాల్‌ విసిరారు మిథున్‌రెడ్డి.. అసలు ఏ విషయంలో అవినీతి జరిగిందో చంద్రబాబు ఆధారాలు బయటపెట్టగలరా? అంటూ చాలెంజ్ చేశారు.. నామినేషన్ వేసే ప్రతి ఒక్కరూ గెలుస్తాం అనే అనుకుంటారు… చంద్రబాబు వ్యాఖ్యలు కూడా అలాంటివే అంటూ ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి.