NTV Telugu Site icon

MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో కాల్‌ లీక్…? ఇదే కుట్రే అంటున్న ఎంపీ..

Mp Gorantla Madhav

Mp Gorantla Madhav

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు.. ఎంపీ ఓ మహిళతో న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అయితే, ఇదంతా కుట్రే అంటున్నారు ఎంపీ మాధవ్‌.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. వీడియోలపై స్పందించారు.. వీడియోలను మార్ఫింగ్ చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రం చేస్తున్నారన్నారు.. అయితే, తను ఏ విచారణకైనా సిధ్దం అన్నారు హిందూపురం ఎంపీ.. ఇప్పటికే, జిల్లా ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.. సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరినట్టు తెలిపారు ఎంపీ మాధవ్‌.. తను ఏ విచారణకైనా సిద్ధమే.. ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిద్ధం అని ప్రకటించారు. ఇదంతా, తెలుగు దేశం పార్టీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట చేసిన కుట్ర అని.. వారిపై పరువునష్టం దావా వేస్తానని వార్నింగ్‌ ఇచ్చారు గోరంట్ల మాధవ్‌.

Read Also: Kolanapaka-Bachannapet: వాగు ఉధృతికి స్కూటీతో కొట్టుపోయిన టీచర్‌..! ఏం జరిగిందంటే..?

నేను జిమ్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోలను కూడా మార్ఫింగ్‌ చేసి ఈ చెత్త వీడియోలను సృష్టించారని మండిపడ్డారు ఎంపీ మాధవ్.. తాను జిమ్ చేస్తున్న వీడియోలను మీడియా సమావేశంలో చూపించారు ఎంపీ.. అరగుండు అయ్యన్నపాత్రుడు కూడా ఇందులో కుట్రదారుడిగా పేర్కొన్న ఆయన.. నన్ను డ్యామేజ్‌ చేయడం కోసం ఈ మార్ఫింగ్ వీడియోను వైరల్‌ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. దమ్ము, ధైర్యం ఉంటే నన్ను స్ట్రయిట్ గా ఎదుర్కోవాలని చాలెంజ్‌ విసిరిన ఆయన.. ఈ వీడియోను టెలికాస్ట్ చేస్తున్న వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానన్నారు.. ప్రెస్ కౌన్సిల్, హైకోర్టు, సుప్రీంలో కూడా ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.. అయితే, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోలో ఓ మహిళతోనే ఎంపీ మాధవ్ న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా ఉంది.. ఎంపీ పదవికే కళంకం తెచ్చేలా ఎంపీ వ్యవహార వైలి ఉందంటూ.. ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.. గోరంట్ల మాధవ్ పై సీఎం వైఎస్‌ జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు..

Show comments