Site icon NTV Telugu

Silpa Chakrapani Reddy: మళ్లీ టీడీపీలోకి శిల్పా చక్రపాణిరెడ్డి..? క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే..

Silpa Chakrapani Reddy

Silpa Chakrapani Reddy

Silpa Chakrapani Reddy: ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. నేతలు పార్టీలు మారడం.. ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.. అయితే, కొన్నిసార్లు పార్టీలో కీలకంగా ఉన్న నేతలు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కూడా త్వరలో మరో పార్టీ కండువా కప్పుకుంటారనే ప్రచారం సాగుతుంటుంది.. ఇప్పుడు అలాంటి ప్రచారమే శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డిపై జరుగుతోంది.. ఆ ప్రచారంపై స్పందించిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే.. కీలక వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలను పదే పదే చెప్పి , నిజమని ప్రచారం చెయ్యడం చంద్రబాబుకు మామూలే అని మండిపడ్డారు. నేను ఆ స్కూల్ స్టూడెంట్ నే.. లోకేష్ భవిష్యత్తు పై చంద్రబాబు ఆందోళనతో ఉన్నారని వ్యాఖ్యానించారు. లోకేష్ కు బుర్ర లేదు.. ఏమి మాట్లాడుతున్నాడో ఎవ్వరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు.

Read Also: TS Cabinet : రేపు తెలంగాణ కేబినెట్‌ సమావేశం

ఇక, తెలుగుదేశం పార్టీలో నేను చేరుతానని కొన్ని చానళ్లలో వస్తున్న వార్తలు నిజం కాదన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి.. ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసి, వైసీపీలోకి వచ్చానని గుర్తుచేసిన ఆయన.. అలాంటి నేను మళ్లీ టీడీపీలోకి ఎలా వెళ్తాను అని ప్రశ్నించారు. మంత్రి పదవి రావచ్చు, రాకపోవచ్చు.. పదవి ముఖ్యం కాదు, పదవి రాకున్నా ఎప్పుడూ అసంతృప్తి చెందలేదన్నారు.. జనంలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వస్తే ఎవ్వరూ తట్టుకోలేరని హెచ్చరించారు. కానీ, సీఎం కావడంతో బిజీగా ఉన్నారని తెలిపారు. మరోవైపు.. ఉద్యోగస్తులు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు.. కానీ, సీఎం వైఎస్‌ జగన్‌ అందరికీ న్యాయం చేస్తారు.. నెలాఖరులోగా శుభవార్త చెబుతారనే నమ్మకాన్న వ్యక్తం చేశారు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.

Exit mobile version