బాబు డ్రామాలను ప్రజలు నమ్మరు.. మరోసారి రోజా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ఫైర్ అయ్యారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. 14 ఏళ్ల ముఖ్యమంత్రివా లేక వీధి రౌడివా? అంటూ కామెంట్ చేసిన ఆమె.. “యథా రాజా తథా ప్రజా” అంటారు.. అయితే ఇప్పుడు అది తెలుగు దేశం పార్టీకి, చంద్రబాబుకే సరి పోతుందని ఎద్దేవా చేశారు.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, అతనిని నమ్మి ఓటేసిన కుప్పం నియోజకవర్గ ప్రజలకి హంద్రీ – నీవా ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు కూడా ఇవ్వకుండా చేసి ఈ రోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి నీరు ఇవ్వలేదని విమర్శించడం ఎక్కడి న్యాయమంటూ మండిపడ్డారు.. కుప్పంలో కనీసం ఇల్లో, కార్యాలయం కూడా ఏర్పాటు చేసుకోకుండా కుప్పం నియోజకవర్గ ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈ రోజు కుప్పం ప్రజలని ఓట్లు వేయమని అడగడం హాస్యాస్పదం అన్నారు.
మరోవైపు.. సిగ్గు లేకుండా కుప్పానికి రండి తేల్చుకుందాం అని పిలుస్తున్నారు అంటూ చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు రోజా.. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు టీడీపీకి డిపాజిట్లు గల్లంతైంది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని వ్యాఖ్యానించిన ఆమె.. గత వారం పట్టాభితో బూతు డ్రామాలు ఆడించి, కుప్పంలో బాంబు డ్రామా ఆడించి.. ఇలా ప్రజలని నమ్మించాలని చూస్తే ప్రజలు ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితులు లేవని.. కుప్పంలో ఏ ఎలక్షన్స్ జరిగినా వార్ వన్ సైడ్ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డికే పట్టం కడుతారనే విషయాన్ని చంద్రబాబు ఇకనైనా గ్రహించాలని హితవు పలికారు. పార్టీ క్యాడర్ మొత్తం చేజారి పోతుందన్న భయంతో దిగజారుడు రాజకీయాలకు పాల్పడితే.. చంద్రబాబు చరిత్ర హీనుడుగా మిగిలి పోతారంటూ హెచ్చరించారు ఎమ్మెల్యే ఆర్కే రోజా.
Also Read
- Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Nara Lokesh: డబ్బులిచ్చి చేతులు దులుపుకోవడానికి రాలేదు.. మంత్రి లోకేశ్ ఫైర్!
- Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
తాజావార్తలు
-
Morning Habit: నిద్రలేవగానే ఫోన్ చూస్తున్నారా? డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
-
Peddi : పెద్ది రీ సెన్సార్.. కొన్ని సీన్స్ డిలీట్ చేసి.. ఇంకొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారు
-
Nara Lokesh: అదనంగా రూ.25 లక్షలు.. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తాం!
-
SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బద్దలు.. కానీ ఆ ఒక్క మార్క్‌ను అందుకోలేకపోయిన వైభవ్!
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!