Site icon NTV Telugu

దేవినేని ఉమపై వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు..

Jogi Ramesh

Jogi Ramesh

టీడీపీ సీనియర్‌ నేత, మాజ ఈమంత్రి దేవినేని ఉమపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దేవినేని ఉమ కుక్క మొరిగినట్లు మొరుగుతున్నాడు అంటూ కామెంట్ చేశారు.. మట్టి, ఇసుక, బూడిద కూడా దోచుకున్న వ్యక్తి ఉమ అని ఫైర్‌ అయిన ఆయన.. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలపై దాడి చేస్తే ఊరుకుంటారా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలను తిడితే కేసులు పెట్టరా? అని వ్యాఖ్యానించారు.. ఇక, ఉమకు తగిన శాస్తి జరగాల్సిందేనన్న జోగి రమేష్.. బుద్ధి లేని వ్యక్తి ఉమ..! తన కారు పై దాడి చేస్తే మీడియాతో ఉమ దర్జాగా ఎలా మాట్లాడారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఉమపై తగిన కేసులు పెట్టాలని డీజీపీని విజ్ఞప్తి చేసిన ఆయన.. ఉమతో పాటు గూండాలు, రౌడీలు వచ్చారని ఆరోపించారు.. ఇక, మాపై దాడి చేస్తే తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు.. మరోవైపు.. అక్రమ మైనింగ్ జరగటానికి ఈ ప్రభుత్వంలో అవకాశమే లేదని స్పష్టం చేశారు జోగి రమేష్‌.

Exit mobile version