NTV Telugu Site icon

Chennakesava Reddy: వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. కేసీఆర్‌ మొనగాడు.. దానికి సిద్ధం కావాలి..!

Chennakesava Reddy

Chennakesava Reddy

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇప్పటికే పలు సందర్భాల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్‌ను సూటిగా ఎటాక్‌ చేసిన ఆయన.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.. రాష్ట్రాల అభివృద్ధికి సహకరించని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు మనమంత సిద్దం కావాలన్నారు చెన్నకేశవరెడ్డి.. ఇదే సమయంలో.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుపై ప్రశంసలు కురిపించారు.. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఢీకొన్న ఏకైక మొనగాడు సీఎం కేసీఆరే అన్నారు… బీజేపీ అధికారం లేని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు రూ.20 కోట్లు ఆఫర్ చేస్తున్నారంటూ ఫైర్‌ అయ్యారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు ఒక తాటి పైకి వచ్చి.. మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి సిద్దం కావాలంటూ పిలుపునిచ్చారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్ కేశవరెడ్డి..

Read Also: MLA Raja Singh: మరో వీడియో రిలీజ్.. నేను అన్నింటికీ సిద్ధం

కాగా, గతంలో గోవ నిషేధ చట్టంపై హాట్‌ కామెంట్లు చేశారు చెన్నకేశవరెడ్డి.. గోవధ నిషేధ చట్టాన్ని ఎత్తివేయాలని డిమాండ్‌ చేసిన ఆయన.. ఇది కాలం చెల్లిన పాత చట్టాల్లో ఒకటని.. ఓట్ల కోసం భారతీయ జనతా పార్టీ ఈ చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. ఆర్​ఎస్ఎస్ దాని అనుబంధ సంస్ధలు మతసామరస్యాన్ని దెబ్బ తీస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. రపంచంలో ఏ దేశంలో ఇలాంటి చట్టం లేదన్నారు. హిందువులకు గోవు పూజ్యనీయమైనదని.. కానీ, ముస్లింలకు ఆహార పదార్థం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.. ఆయన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కూడా ఆయన వివరణ ఇచ్చుకున్నారు.

Show comments