NTV Telugu Site icon

Pawan Kalyan: సినిమాల్లో మాదిరి ప్రజల్లోనూ నటిస్తున్నారు..! జీవితంలో పవన్‌ సీఎం కాలేరు..

Balanagi Reddy

Balanagi Reddy

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై హాట్‌ కామెంట్లు చేశారు వైసీపీ ఎమ్మెల్యే.. పవన్ కల్యాణ్‌ సినిమాల్లో మాదిరిగా ప్రజల్లో నటిస్తే ప్రజలు నమ్మరని విమర్శించారు వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి.. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగరూరులో గడగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరును గురించి లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీల్లో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా.. పవన్‌ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు… టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రిని చేసేందుకే పవన్ కల్యాణ్‌ పోరాటం చేస్తున్నారని ఆరోపణలు గుప్పించిన ఆయన.. పవన్ కల్యాణ్‌ జీవితంలో ముఖ్యమంత్రి కాలేరని జోస్యం చెప్పారు.. ఇక, త్వరలో జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.. 2024లో మరోసారి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా.. సంక్షేమ పథకాలు యథావిథిగా కొనసాగిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో కొనసాగుతున్న ఇళ్ల నిర్మాణ పనులను చూసి ఓర్వలేకనే జనసేన నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బాలనాగిరెడ్డి.

Read Also: PM Modi : కేంద్ర ప్రభుత్వం ఇదే నిజాయితీతో పని చేస్తుంది